పూర్తయిన చర్లపల్లి రైల్వేస్టేషన్... ఇక్కడి నుంచి నడిచే రైళ్ల జాబితా
దాదాపు 100 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ నగరంలో అతి పెద్ద రైల్వేస్టేషన్ రూపుదాల్చింది. అదే చర్లపల్లి రైల్వేస్టేషన్. సికింద్రాబాద్, కాచిగూడ, హైదరాబాద్ స్టేషన్లపై రోజురోజుకు రైళ్ల ఒత్తిడితోపాటు ప్రయాణికుల తాకిడి పెరుగుతుండటంతో ప్రత్యామ్నాయ రైల్వేస్టేషన్ గా దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి రైల్వేస్టేషన్ ను అభివృద్ధి పరిచింది. రూ.430 కోట్ల వ్యయంతో విమానాశ్రయం తరహాలో రెండంతస్తుల్లో దీన్ని నిర్మించారు. మొత్తం 9 ప్లాట్ ఫాంలు, 9 లిఫ్ట్ లు, 5 ఎస్కలేటర్లు, రెండు ఫుట్ ఓవర్ వంతెనలు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే 5 ప్లాట్ ఫాంలు ఉంటే మరో నాలుగింటిని అదనంగా నిర్మించారు.
ప్రధానమంత్రి సమయం ఇస్తే చాలు
ప్రధానమంత్రి నరేంద్రమోడీ వీలుచూసుకొని చర్లపల్లి స్టేషన్ ను ప్రారంభించబోతున్నారు. దీనికి ఇంకా తేదీ ఖరారు కాలేదు. పనులన్నీ పూర్తికావడంతో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు స్టేషన్ ను పరిశీలించి వెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడకు చేరుకునేందుకు రోడ్లను విస్తరించే పనులను చేపట్టింది. ప్రస్తుతం ఆరు ఎక్స్ ప్రెస్ రైళ్లు నడిచేలా, 12 రైళ్లను ఈ స్టేషన్ లో ఆపేలా రైల్వేబోర్డు నుంచి అనుమతులు లభించాయి. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించడమే తరువాయి.. స్టేషన్ నుంచి రైళ్లు నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే సిద్ధంగా ఉంది. దూర ప్రాంతాలకు నడిచే రైళ్లను ఇక్కడి నుంచే నడపబోతున్నారు. వాటి వివరాలను త్వరలోనే ప్రకటిస్తారు.

చర్లపల్లి నుంచి నడవబోతున్న రైళ్లు
12589/12590 గోరఖ్‌పూర్ - సికింద్రాబాద్ - గోరఖ్ పూర్
12603 ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ - హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్
12604 హైదరాబాద్ - ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ - హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్
18045 షాలిమార్ - హైదరాబాద్ ఈస్ట్‌కోస్టు ఎక్స్‌ప్రెస్
18046 హైదరాబాద్ - షాలిమార్ ఈస్ట్‌కోస్టు ఎక్స్‌ప్రెస్
చర్లపల్లి స్టేషన్ లో ఆగే రైళ్ల వివరాలు
12705/12706 గుంటూరు - సికింద్రాబాద్ - గుంటూరు ఎక్స్‌ప్రెస్
17011/17012 హైదరాబాద్ - సిర్పూర్ కాగజ్‌నగర్ - హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్
12757/12758 సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్‌నగర్ - సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్
17201/17202 గుంటూరు - సికింద్రాబాద్ - గుంటూరు గోల్కొండ ఎక్స్‌ప్రెస్
17233/17234 సికింద్రాబాద్ - సిర్పూర్ కాగజ్‌నగర్ - సికింద్రాబాద్ భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్
12713/123714 విజయవాడ - సికింద్రాబాద్ - విజయవాడ శాతవాహన ఎక్స్‌ప్రెస్












Click it and Unblock the Notifications