ఆత్మవిశ్వాసమే ఆడపిల్లల ఆయుధం.!మహిళా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.!
హైదరాబాద్ : ఆత్మవిశ్వాసమే ఆయుధంగా ఆడబిడ్డలలు ముందుకు సాగాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. ఘట్ కేసర్ లోని మహిళా సోషల్ వెల్ఫేర్ కళాశాలలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత, మహిళలు బాగుంటేనే దేశం రాష్ట్రం బాగుంటుందన్నారు.
ఆత్మ విశ్వాసం, ధైర్యం ప్రధాన ఆయుధాలుగా ఆడపిల్లలు జీవితంలో ముందుకు సాగాలన్న ఎమ్మెల్సీ కవిత, విద్య ద్వారానే ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని అన్నారు. బాలికల చదువుల కోసం తెలంగాణ ప్రభుత్వం సోషల్ వెల్ఫేర్, గురుకులాలతో పాటు, విదేశీ విద్య కు సైతం తోడ్పాటునందిస్తోందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మహిళలు ఉన్నతంగా ఎదిగేందుకు వి-హబ్ లాంటివి ఏర్పాటు చేశారని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఆడబిడ్డలు జీవితంలో అనేక అవరోధాలు ఎదుర్కొంటున్నారని, మహిళల మీద అఘాయిత్యాలు అరికట్టడానికి షార్ట్ ఫిల్మ్ రూపొందిస్తామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.
ఎల్బీ నగర్, ఇబ్రహీంపట్నం, బద్వేల్, మహేంద్ర హిల్స్ లో గల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు, సిబ్బంది వేడుకల్లో పాల్గొన్నారు. విద్యార్థినులు సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు, నాటకాలు ద్వారా మహిళల గొప్పతనాన్ని వివరించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా, సీఎం చంద్రశేఖర్ రావు మహిళా విద్య కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు మరో మంత్రి మంత్రి మల్లారెడ్డి.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications