Jubilee hills: తొలి ఫలితం, ఊహించని ట్విస్ట్ - సంచలనం ఖాయం..!!
జూబ్లీహిల్స్ లో ఫలితం పై ఉత్కంఠ కొనసాగుతోంది. తొలి ఫలితాల్లో కాంగ్రెస్ అధిక్యతలో ఉంది. హోరా హోరీగా సాగిన ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలు పోటీ పడ్డాయి. కాంగ్రెస్ - బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ కొనసాగింది. ఈ రోజు ప్రారంభమైన కౌంటింగ్ లో ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించింది. వీటిల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. మొత్తం పది రౌండ్లలో తుది ఫలితం వెల్లడి కానుంది. కాగా, ఇప్పటికీ బీఆర్ఎస్ తమ గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తోంది.
జూబ్లీహిల్స్ లో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ముగిసింది. కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్ ఆధిక్యతలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్-39, బీఆర్ఎస్ -36, బీజేపీ-10 ఓట్లు వచ్చాయి. ఈవీఎంల కౌటింగ్ ప్రారంభమైంది. ముందుగా షేక్‌పేట్ డివిజన్‌తో ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలు పెట్టారు. కాగా, ఇక్కడా కాంగ్రెస్ అభ్యర్ధి స్వల్ప మెజార్టీతో కొనసాగుతున్నారు. ఈవీఎంల కౌటింగ్ ప్రారంభమైంది. ముందుగా షేక్‌పేట్ డివిజన్‌తో ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలు పెట్టారు.

షేక్‌పేట్ డివిజన్‌లో మొత్తం 42 బూత్స్ ఉన్నాయి. రౌండ్ - 2 రెండో రౌండ్‌లోనూ షేక్‌పేట్ డివిజన్‌లో ఉన్న మరో 28 బూత్స్ లెక్కిస్తారు. అంతేకాకుండా ఎర్రగడ్డ డివిజన్‌లో 10 బూత్స్, వెంగళరావు డివిజన్‌లో 4 పోలింగ్ కేంద్రాల్లో ఓట్లను లెక్కింపు చేపడతారు. యూసఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో జరుగుతోంది. 42 టేబుల్స్ ద్వారా పది రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి చేయనున్నారు. నియోజకవర్గంలో దాదాపు 4 లక్షల మంది ఓటర్లు ఉండగా, 50 శాతం ఓట్లు పోల్ అయ్యాయి.
ఇక, డివిజన్ల వారీగా పోలింగ్ సరళికి అనుగుణంగా తమకు వచ్చే ఓట్ల పైన పార్టీలు అంచనాలతో ఉన్నాయి. ఆశించిన స్థాయిలో పోలింగ్ శాతం పెరగకపోవడంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. తొలి ఫలితాలు వెల్లడి అవుతున్నా.. ఎవరికి వారు తామంటే తాము గెలుస్తామని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ధీమాగా ఉన్నాయి.
కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసు యంత్రాంగం పూర్తిస్థాయి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసింది. ఈ ఉప ఎన్నికపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తొలి మూడు రౌండ్ల కౌంటింగ్ లో కాంగ్రెస్ కు ఆధిక్యత వస్తుందని... అదే సమయంలో మిగిలిన డివిజన్లలో తమ ఆధిక్యత కొనసాగుతుందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. కాగా.. కాంగ్రెస్ మాత్రం అన్ని డివిజన్లలోనూ తమకే మెజార్టీ వస్తుందని ధీమాతో ఉన్నారు. దీంతో.. కౌంటింగ్ పైన ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications