Rahul Gandhi: కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తాం..
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళల బ్యాంక్ అకౌంట్ లో సంవత్సరానికి రూ.లక్ష జమ చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. హైదరాబాద్ శివారు తుక్కుగూడలోని భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కాదు.. ఇది 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షల ఆశలని రాహుల్ గాంధీ చెప్పారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని 5 హామీలు.. దేశ ప్రజల ఆశలు, ఆశయాలేనని వివరించారు.
దేశంలోని నిరుద్యోగులు అందరికీ లక్ష రూపాయల జీతంతో ఉద్యోగం ఇప్పించబోతున్నట్లు చెప్పారు. నిరుద్యోగులకు స్కిల్ డెవలప్ మెంట్ కింద శిక్షణ ఇస్తామని.. దేశంలోని యువత అందరికీ ఏడాది పాటు అప్రంటీస్ ఇప్పిస్తామని పేర్కొన్నారు. దేశంలోని నిరుద్యోగ యువత అందరికీ లక్ష రూపాయల జీతంతో ఏడాదిపాటు అప్రంటీస్ శిక్షణ ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఈ శిక్షణ ఇప్పిస్తామని వివరించారు.

యువతకు సంబంధించి ప్రతి విషయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని ప్రకటించారు. మహిళల కోసం నారీ న్యాయ్ నినాదంతో ముందుకొస్తున్నామని తెలిపారు. నారీ న్యాయ్ కింద ప్రతి కుటుంబంలోని ఓ మహిళకు.. సంవత్సరానికి లక్ష రూపాయలు ఇవ్వబోతున్నట్లు వివరించారు. నిరుపేద కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ లక్ష రూపాయలు ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు.
దేశంలోని ఏ కుటుంబానికి కూడా సంవత్సర ఆదాయం లక్ష రూపాయలు తక్కువ కాకుండా చూస్తామి ప్రకటించారు. ఇక తెలంగాణ సంబంధి పలు హామీలు ఇచ్చారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కట్టుబడి ఉన్నామని తెలిపారు. పాలమూరుకు జాతీయ హోదా ,మేడారం జాతరకు జాతీయ పండుగగా గుర్తింపు, ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications