హరీష్ వచ్చినా చేర్చుకుంటాం, ప్రత్యేకం కాదు, రేవంత్‌కు కాంగ్రెస్ నేత ఝలక్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును ధీటుగా ఎదుర్కొనే సత్తా రేవంత్ రెడ్డికి ఉందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత షబ్బీర్ అలీ ఆదివారం అన్నారు. కేసీఆర్ రాకను తాము స్వాగతిస్తున్నామని చెప్పారు.

చదవండి: రేవంత్‌ను ఆపండి: షా ఫోన్, బాబు ఆవేదన ఇలా, అన్నీ చెప్తా.. రేవంత్ సంచలనం

ఏ పదవి ఇచ్చినా స్వాగతిస్తాం

ఏ పదవి ఇచ్చినా స్వాగతిస్తాం

రేవంత్ రెడ్డిని పార్టీలోకి స్వాగతిస్తున్నామని దానం నాగేందర్ అన్నారు. ఆయనకు ఏ పదవి ఇచ్చినా తాము స్వాగతిస్తామని చెప్పారు. స్పీకర్ వెంటనే పార్టీ మారిన ఎమ్మెల్యేలు చేసిన రాజీనామాలను ఆమోదించాలన్నారు. లేదంటే అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నారనే అభిప్రాయాలు ఏర్పడుతాయన్నారు.

హరీష్ రావు వచ్చినా స్వాగతిస్తాం

హరీష్ రావు వచ్చినా స్వాగతిస్తాం

కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు సాధారణమని మరో కాంగ్రెస్ నేత చెప్పారు. రేవంత్ రెడ్డి కాదు మంత్రి హరీష్ రావు వచ్చినా తాము స్వాగతిస్తామని మాజీ మంత్రి డీకే అరుణ చెప్పారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా గౌరవిస్తామన్నారు.

రేవంత్ చేరిక ప్రత్యేకం కాదు

రేవంత్ చేరిక ప్రత్యేకం కాదు

కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి చేరిక ప్రత్యేకం కాదని పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. అందరిలాగానే ఆయన పాత్ర కాంగ్రెస్ పార్టీలో ఉంటుందని చెప్పడం గమనార్హం. ప్రత్యేక పాత్ర అంటూ ఏమీ ఉండదని అంటున్నారు. తద్వారా ఆయన చేరికపై కొందరు కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి ఉందని తెలుస్తోంది.

రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లోకి

రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లోకి

కాగా, రేవంత్ రెడ్డి ఎల్లుండి ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యే పదవికి శనివారం రాజీనామా చేశారు. పీఏని వెనక్కి పంపించారు. గన్‌మెన్‌లను తిప్పి పంపించారు. నెల రోజుల్లో ఎమ్మెల్యే క్వార్టర్ కాళీ చేయనున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Congress leaders like Shabbir Ali, Danam Nagender are welcomed Revanth Reddy's decision to join Telugu Desam Party.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి