కాంగ్రెస్‌లో జగ్గారెడ్డి కాక .. రేవంత్ రెడ్డిపై అసహనం.. సీఎల్పీ నుంచి బాయ్‌కాట్ !!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో విబేధాలు మరోసారి భగ్గుమన్నాయి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి - వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే జగ్గారెడ్డి మధ్య పోరు కొనసాగుతూనే ఉంది. తొలి నుంచి రేవంత్ రెడ్డి తీరుపై గుర్రుగా ఉన్న ఆయన.. తాజాగా మరోసారి అసహం వ్యక్తం చేశారు. తనకు పార్టీలో అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నాయని జ‌గ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

 సీఎల్పీని బాయ్‌కాట్..

సీఎల్పీని బాయ్‌కాట్..

రేపటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశాన్ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హోటల్ తాజ్ డెక్కన్‌లో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు , జిల్లా అధ్యక్షులు హాజరయ్యారు. అయితే ఈ భేటీకి ముందుకు జగ్గారెడ్డి ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. కానీ పార్టీ అంతర్గత విషయాలు మాట్లాడవద్దని ఆయ‌న‌కు సీఎల్పీ నేత భట్టితో పాటు పలువురు నేత‌లు సూచించారు. దీంతో జగ్గారెడ్డి ఆ సమావేశాన్ని విరమించుకున్నారు. తన గోడును సీఎల్పీ భేటీలో అయినా అడుగుదామని అనుకున్నారు. కానీ ఇంతలోనే సీఎల్పీ సమావేశాన్ని బాయ్ కాట్ చేశారు.

 పార్టీలో చేదు అనుభ‌వాలు

పార్టీలో చేదు అనుభ‌వాలు


టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన ఇష్టం ప్రకారం వ్యవహరిస్తున్నారని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు తెలియకుండానే.. మెదక్ జిల్లా పర్యటనకు వెళ్లారని మండిపడ్డారు. తనకు ప్రోటోకాల్ కూడా పాటించడం లేదని దుయ్యబట్టారు. సీఎల్పీ సమావేశంలో చాలా విషయాలు చెబుతామని వచ్చా.. కానీ వద్దన్నారు. అందుకే ఈ భేటీ నుంచి వెళ్లిపోతున్నానని పేర్కొన్నారు. పార్టీలో తనకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయని మండిపడ్డారు. గతంలో కూడా పలు మార్లు ఇలాగే జరిగిందని గుర్తు చేశారు. పార్టీని అధికారంలోకి రావాలంటే అందరిని కలుపుకుపోవాలి.. కానీ.. ఏకపక్షంగా వ్యవహరిస్తే కుదరని మండిపడ్డారు. ఇటీవల పార్టీలో జరుగుతున్న పరిమాణాలతో విసుగుచెందానని ఆవేదన వ్యక్తం చేశారు.

 ర‌చ్చ‌బండ‌తో ర‌చ్చ మొద‌లై...

ర‌చ్చ‌బండ‌తో ర‌చ్చ మొద‌లై...

తొలి నుంచి రేవంత్ రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడిని చేయడం ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇష్టం లేదు. ఇద్దరూ కలిసిన సందర్బాలు తక్కువే. పార్టీలో ఎవరికివారే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. రేవంత్ రెడ్డి సైతం మెదక్ జిల్లాలో ఆయన పర్యటన కార్యక్రమాలపై జ‌గ్గారెడ్డికి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగానే ముందుకువెళ్తున్నది వాద‌న‌. రచ్చబండ కార్యక్రమంతో మొదలైన రచ్చ కొనసాగుతూనే ఉంది. ఇద్దరికి పార్టీలో పొసగడం లేదు. ఎవరి లెక్కలు వారివే అన్న తీరుగా వెళ్తున్నారు. రేవంత్ రెడ్డి తీరును బహిరంగంగానే జగ్గారెడ్డి విమర్శిస్తున్నారు.

 త్వ‌ర‌లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా?

త్వ‌ర‌లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా?

కాగా, ఎమ్మెల్యే జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారని గత కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో పార్టీ నేతలు రంగంలోకి దిగి ఆయనను బుజ్జగించారు. దీంతో ఆయ‌న కాస్త మొత్తబడ్డారు. తన రాజీనామా నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు . పార్టీ అధిష్టాన్నాన్ని కలిసి తన అభిప్రాయన్ని వివరిస్తారని పేర్కొన్నారు. పార్టీలో తనకు జరుగుతున్న అవమానాలు భరించలేపోతున్నానని ఆగ్రహం మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+