'ఒరిజినల్ ఎన్టీఆరే ఓడిపోయారు: డూప్లికేట్ ఎన్టీఆర్ ఎంత'?

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: మా నియోజకవర్గంలో ఒరిజినల్ తారకరామారావే ఓడిపోయారు... ఈ డూప్లికేట్ తారకరామారావు మా కల్వకుర్తి ప్రజలకు ఓ లెక్కా ... అంటూ తెలంగాణ రాష్ట్ర మంత్రి కె. తారకరామారావునుద్దేశించి కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.

బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే కల్వకుర్తికి చెందిన కొందరు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన వారు రాజీనామా చేసి మళ్ళీ గెలవమని సవాల్ చేస్తున్నారని చెప్పారు.. కెసిఆర్ దళితుడ్ని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు... ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నాడు.. ఏం అయిందో చెప్పాలని డిమాండ్ చేశారు వంశీచంద్ రెడ్డి.

Congress MLA Vamshi chand Reddy slams minster KTR

మీరు, మీ కుటుంబంలోని కొంతమంది బంధువులు ఫార్మాసిటీ పేరుతో భూములు లాక్కున్నారు.123 జీవో ప్రకారం భూమిని అక్రమంగా భూమిని లాక్కున్నారు కనుక మేము ఫార్మా సిటీని అడ్డుకుంటామని వంశీచంద్‌రెడ్డి చెప్పారు.

అలాగే సిరిసిల్లలో మీ బంధువులు అక్రమంగా భూ సేకరణ చేస్తున్నారని, 2013 చట్టం ప్రకారం భూమిని సేకరించకుండా పేదలను మోసం చేస్తున్న మీ బంధువుల పైన సీఐడీ ఎంక్వయిరీ వేయండని వంశీచంద్‌రెడ్డి డిమాండ్ చేశారు.

మీ అక్రమాలు బయట పడతాయంటూ ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇప్పుడు అసెంబ్లీ నడుస్తుంది... ఫార్మా సిటీ కావాలి అని మేడిపల్లి ప్రజలు అంటే నేను ముక్కు నేలకు రాస్తాను... కాంగ్రెస్ నుండి వచ్చిన ప్రజాప్రతినిధులు దమ్ముంటే కారు గుర్తుమీద గెలవాలి నేను సవాలు చేస్తున్న... అంటూ వంశీచంద్‌రెడ్డి పేర్కొన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Kalwakurthy MLA Vamshi chand Reddy made allegations on Telangana minister KTR on Tuesday at Assembly media point. He spoke to media at Assembly media point.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి