వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ తర్వాత తెలంగాణలో ఏపీ సీఎం రికార్డ్!: చంద్రబాబుకు ఉత్తమ్ 15 సీట్లు ఆఫర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తొలి అసెంబ్లీ రద్దు కావడం ఓ చారిత్రాత్మకం అయితే, పొత్తుల విషయంలోను మరో రాజకీయ చారిత్రాత్మక ఘట్టానికి తెరలేవబోతోంది. 36 ఏళ్ల టీడీపీ చరిత్రలో ఎప్పుడూ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడింది. కానీ ఇప్పుడు తెలంగాణలో ఆ పార్టీతో కలిసి అడుగులు వేస్తూ రికార్డ్ సృష్టించింది. టీడీపీ, కాంగ్రెస్ పార్టీల పొత్తు అంశంపై నేడు తేలిపోనుంది. ఇంకా చెప్పాలంటే ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ఎప్పుడో ఖరారయిదని, కేవలం సీట్ల పంపకం గురించి మాత్రమే శనివారం చర్చలు జరుగుతున్నాయని చెబుతున్నారు.

Recommended Video

టీడీపీతో పొత్తుపై ఉత్తమ్‌ క్లారిటీ

చదవండి: బాబు మోహన్, కొండా సురేఖలకు అందుకే షాక్: 105 మందిలో ఓడినవారూ

ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శనివారం హైదరాబాద్‌లో తొలుత పార్టీ తెలంగాణ అధ్యక్షులు ఎల్ రమణ తదితర నేతలతో భేటీ కానున్నారు. ఆ తరువాత ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో పొత్తులు, సీట్లపై చర్చించనున్నారు.

చదవండి: ఆ కమిటీలో రేవంత్ రెడ్డికి చోటు: చంద్రబాబు-రాహుల్ గాంధీ దోస్తీ ఖాయం!

90 స్థానాల్లో కాంగ్రెస్, 29 స్థానాల్లో మిత్రులు

90 స్థానాల్లో కాంగ్రెస్, 29 స్థానాల్లో మిత్రులు

ఇప్పటికే సీట్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఏయే పార్టీలను కలుపుకొని వెళ్లాలి, ఎవరికి ఎన్ని సీట్లు ఇవ్వాలనే అంశంపై ప్రాథమికంగా కాంగ్రెస్ పార్టీ నేతలు నిర్ణయానికి వచ్చారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 90 స్థానాలకు పోటీ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. మిగతా 29 స్థానాలను మిత్రులకు కేటాయించాలని నిర్ణయించింది.

టీడీపీకి 15 నుంచి 20 సీట్లు

టీడీపీకి 15 నుంచి 20 సీట్లు

ఈ 29 స్థానాలలోనే తెలుగుదేశం పార్టీకి కేటాయించే స్థానాలు ఉంటాయి. చర్చల సమయంలో పట్టువిడుపులతో వ్యవహరించే అవకాశం ఉంటుంది. టీడీపీ, కాంగ్రెస్ మధ్య చంద్రబాబు వంటి నేతలతో ఈ రోజు చర్చలు జరుగుతున్నప్పటికీ.. అంతర్గతంగా తెలంగాణలో చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. టీడీపీ 29 సీట్లు కోరుతోందని సమాచారం. టీడీపీ 29 సీట్లు కోరినా 15 నుంచి 20 వరకు ఇవ్వవచ్చునని చెబుతున్నారు.

పొత్తులకు ఆమోదం

పొత్తులకు ఆమోదం

తమతో కలిసి వచ్చే మిగతా పార్టీలకు 10 నుంచి 14 సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ దాదాపు నిర్ణయించిందని తెలుస్తోంది. టీడీపీ, ఇతర పార్టీలతో పొత్తులపై ప్రాథమికంగా అవగాహన వచ్చిన తర్వాత ఢిల్లీకి వెళ్లి అధిష్టానం నుంచి ఆమోదం పొందుతామని చెబుతున్నారు. కేసీఆర్‌ను ఓడించాలంటే టీడీపీ సహా ఇతర పక్షాలతో పొత్తు తప్పనిసరి అని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.

చంద్రబాబు రాక, కాంగ్రెస్‌లో ఉత్కంఠ

చంద్రబాబు రాక, కాంగ్రెస్‌లో ఉత్కంఠ

ఆయా పార్టీలు కలిసి వచ్చినప్పటికీ సీట్ల సర్దుబాటు కష్టతరంగానే ఉంటుందని, అయినప్పటికీ పొత్తులకు వెళ్తున్నట్లు కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు శనివారం హైదరాబాద్‌కు వస్తున్నందున పొత్తులపై చర్చలకు అడుగులు ముందుకు పడవచ్చని కాంగ్రెస్‌ భావిస్తోంది. రాష్ట్ర స్థాయిలో పొత్తులపై ఏఐసీసీ ఇంచార్జ్ కార్యదర్శి ఆర్‌సి కుంతియా, పీసీసీ ముఖ్యులకు అధిష్ఠానం స్వేచ్ఛ ఇచ్చినందున పార్టీకి ప్రయోజనం కలిగించేలా చర్చలను కొలిక్కి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు రాక కాంగ్రెస్ నేతల్లోను ఉత్కంఠ కలిగిస్తోంది. ఆయన ఏ సీట్లు కోరుతారని అనే అంశంపై చర్చ సాగుతోంది.

కోదండరాంతో వెళ్లేందుకు బీజేపీ ఆసక్తి

కోదండరాంతో వెళ్లేందుకు బీజేపీ ఆసక్తి

మరోవైపు, కోదండరాం పార్టీ తెలంగాణ జన సమితితో పొత్తుకు బీజేపీ ఆసక్తి చూపిస్తోంది. ఈ మేరకు బీజేపీ జాతీయస్థాయి ముఖ్యనేత ఆదేశాలతో ఆ పార్టీ రాష్ట్ర నేత కిషన్ రెడ్డి శుక్రవారం కోదండరాంతో భేటీ అయ్యారని తెలుస్తోంది. హైదరాబాద్‌లోని ఓ హోటల్లో సమావేశమైన ఇరువురు ఈ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడంపై చర్చించారని సమాచారం. కాంగ్రెస్‌, సీపీఐలతో కలిసి తెలంగాణ జన సమమితి ఎన్నికలకు సన్నద్ధమవుతున్నట్లుగా ప్రచారం జరుగుతున్న ప్రస్తుత సమయంలో కోదండరాంతో కిషన్ రెడ్డి సమావేశమవడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. చర్చలు కొలిక్కి రాలేదని తెలుస్తోంది.

English summary
An alliance between the Congress and the Telugu Desam for the coming Telangana assembly elections is a possibility. TPCC leaders are going to discuss the matter with TD’s national president and AP Chief Minister N Chandrababu Naidu on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X