రెండో విడత నామినేటెడ్ పదవుల జాబితా సిద్దం - లిస్టులో..!!

తెలంగాణ కాంగ్రెస్ నేతలకు పదవుల పందేరానికి రంగం సిద్దమైంది. రెండో విడత నామినేటెడ్ పదవుల జాబితా ఖరారు చేసారు. ముఖ్యమంత్రి రేవంత్ విదేశీ పర్యటన నుంచి వచ్చిన తరువాత ఈ జాబితాను అధికారికంగా ప్రకటించనున్నారు. ఇప్పటికే పార్టీ నాయకత్వం నామినేటెడ్ పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదే సమయంలో టీపీసీసీకి కొత్త సారధితో పాటుగా మంత్రివర్గ విస్తరణ పైన పార్టీ నాయకత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.

పదువుల పంపకాలు
తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి పదవులు భర్తీకి చర్యలు మొదలయ్యాయి. మొదటి విడతలో 37 పోస్టులు భర్తీ అయ్యాయి. ఇక రెండో విడత కార్పొరేషన్ పదవుల పంపకానికి రంగం సిద్ధమైంది. ఈసారి కీలకమైన కార్పొరేషన్ పదవుల భర్తీతో పాటు.. ప్రభుత్వం కొత్తగా రైతు, విద్య కమిషన్లు ఏర్పాటు చేయనుంది. వాటితో పాటు బిసీ కమీషన్ భర్తీ ఏర్పాటు దిశగా తుది కసరత్తు జరుగుతోంది. పదవుల కోసం చివరి నిమిషంలో నేతలు లాబీయింగ్ ముమ్మరం చేసారు. తొలి విడతలో మహిళా, ఫైనాన్స్ కమిషన్‌లకు చైర్మన్లను, మెంబర్లను కూడా వేసింది.

Congress to announce second list of nominated posts details here

సీనియర్లకు ప్రాధాన్యత
రెండో విడత నామినేటెడ్ పదవుల్లో భాగంగా మొదటి విడతలో చోటు దక్కని సామాజిక వర్గాలకు, నేతలకు ఈసారి బెర్త్ పక్కా అనే టాక్ పార్టీలో బలంగా వినిపిస్తుంది. ఈసారి చాలా కీలకమైన కార్పొరేషన్ పదవులు భర్తీ కానున్నాయి. ఆర్టీసీ కార్పొరేషన్, సివిల్ సప్లై కార్పొరేషన్, మూసీ కార్పొరేషన్, హెచ్ఎండిఏ, రెడ్కో, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హాకా, రైతు కమిషన్, విద్యా కమిషన్, స్టేట్ కౌన్సిల్ చైర్మన్, యాదవ, కూర్మ కార్పొరేషన్, చేనేత కార్పొరేషన్ పదవులు భర్తీ కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరి పేర్లు ఫైనల్ అయినట్లు సమాచారం.

జాబితా సిద్దం
రైతు కమిషన్ చైర్మన్ గా సీనియర్ నేత కోదండరెడ్డి, విద్య కమిషన్ చైర్మన్ గా రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి పేర్లు ఆమోదించినట్లు పార్టీ నేతల సమాచారం. ఈ రెండు కమిషన్‌లలో చెరో నలుగురు చొప్పున 8 మందిని మెంబర్లుగా నియమించనున్నారు. ప్రస్తుత బీసీ కమిషన్ కాల పరిమితి ముగియనుంది. కొత్త కమిషన్ ఛైర్మన్ గా నిరంజన్ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా రాష్ట్ర హెచ్ఆర్సీ, సమాచార హక్కు చట్టం సభ్యులను నియమించాల్సి ఉంది. దీంతో, వచ్చే వారం రెండో విడత నామినేటెడ్ పదవుల భర్తీ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+