సూర్యాపేట జిల్లాలో పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల ఘర్షణ .. ఎందుకంటే
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల తొలివిడత పోలింగ్ జరుగుతోంది. తెలంగాణలో పరిషత్ ఎన్నికల్లో ఊహించని విచిత్ర సంఘటనలతో పాటు పలు ఘర్షణలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈ సారి తెలంగాణా రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు బ్యాలెట్ ఎన్నికలు కావటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇక ఈ నేపధ్యంలోనే హోరాహోరీగా ఎన్నికల ప్రచారం చేసిన రాజకీయ పార్టీల నాయకులు పోలింగ్ సమయంలోనూ ఘర్షణలకు దిగుతున్నారు.
తెలంగాణలో జరుగుతున్న తొలివిడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు ఓ పోలింగ్ బూత్ వద్ద బాహాబాహీకి దిగారు. పోలింగ్ కేంద్రంలో ప్రచారం చేస్తున్నారంటూ ఒకరిపై ఒకరు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కీతవారిగూడెం పోలింగ్ కేంద్రం వద్ద ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. ఓటు వేస్తామంటూ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన ఇరు పార్టీల అభ్యర్థులు లోపల ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలతో వాగ్వాదం మొదలయ్యింది. దీంతో వాగ్వాదం కాస్తా ఘర్షణకు దారితీసింది. పోలీసులు జోక్యం చేసి ఇరు వర్గాల వారిని శాంతింపజేశారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది.

-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications