ఎస్పై వేధింపులపై కానిస్టేబుల్ సెల్ఫీ వీడియో, ఉద్యోగం పీకేసిన అధికారులు
సూర్యాపేట : స్టేషన్‌లో తన బాస్ ఎస్సై వేధించడాన్ని తట్టుకోలేకపోయాడు. ఆరోగ్యం బాగోలేదని సిక్ లీవ్ పెడితే జీతం ఆపేయడంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎస్సై తీరును ఎలాగైనా ఎండగట్టాలనుకొని సెల్ఫీ వీడియో తీశాడు. సోషల్ మీడియా వాట్సప్‌లో షేర్ చేయడంతో అది వైరలైంది. కానిస్టేబుల్ క్రమశిక్షణ ఉల్లంఘించారని అధికారులు చర్యలు తీసుకున్నారు. విధుల నుంచి తప్పిస్తున్నట్టు పేర్కొన్నారు.
వేధింపుల పర్వం ..
సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ పోలీసు స్టేషన్‌లో రమేశ్ అనే కానిస్టేబుల్ పనిచేస్తున్నాడు. అయితే అతనికి ఈ మధ్య అనారోగ్య సమస్యలు తలెత్తాయి. ఎండకాలం కావడంతో బీపీ కూడా ఎక్కువైంది. దీంతో స్థానికంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చెకప్ చేసుకొని .. సీక్ లీవ్ పెట్టాడు. అయితే అప్పటికే స్టేషన్ ఎస్ఐ తన జీతం ఆపేశారని కానిస్టేబుల్ ఆక్రోశం చెందాడు. ఎస్సై రంజిత్ రెడ్డి తీరును నిరసిస్తూ సెల్ఫీ వీడియో తీశాడు. తన వాట్సాప్‌లో పోస్ట్ చేయడంతో అదీ కాస్త వైరలైంది.

సెల్ఫీ వీడియో
అంతేకాదు తనను నిత్యం రంజిత్ రెడ్డి వేధించేవాడని వీడియోలో పేర్కొన్నాడు రమేశ్. విసుగుకల్పించే పనులు చెప్పేవాడని వాపోయాడు. ఆరోగ్యం బాగోలేక సిక్ లీవ్‌లో ఉంటే డీటీవోకు ఫోన్ చేసి తన జీతాన్ని ఆపాడని వాపోయాడు. మీరు జీతం ఆపినా ఇబ్బంది లేదని .. ఐదెకరాల పొలం ఉందని చెప్పాడు. తనకు ఇల్లు కిరాయిలు కూడా వస్తాయని .. మీరు ఒక నెల జీతం తీసుకోకుండా పనిచేయాలని ఎస్సైకి సూచించాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. ఫై అధికారితో ఇబ్బందులు ఉంటే తమతో చెప్పాలని గానీ .. వీడియో పోస్ట్ చేయడం ఏంటి అని ప్రశ్నించారు. అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. విధుల నుంచి తప్పిస్తున్నట్టు స్పష్టంచేశారు.












Click it and Unblock the Notifications