తెలంగాణ రాష్ట్రంలో కరోనా హాట్ స్పాట్ జిల్లాలు ఇవే, ఆరెంజ్ జోన్లో ఈ జిల్లాలు
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనావైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న హాట్‌స్పాట్ జిల్లాల జాబితాను కేంద్రం బుధవారం విడుదల చేసింది. దేశంలో ఉన్న మొత్తం 640 జిల్లాల్లో మొత్తం 170 జిల్లాలను హాట్‌స్పాట్స్‌గా కేంద్ర వైద్యారోగ్యశాఖ గుర్తించింది. అయితే, మరో 207 జిల్లాలను పొటెన్షియల్ హాట్‌స్పాట్ జిల్లాలుగానూ, మిగిలిన వాటిని గ్రీన్ జోన్‌గా ఉన్నట్లు కేంద్రం తెలిపింది.
Recommended Video

తెలంగాణలో హాట్ స్పాట్ జిల్లాలు..
లాక్‌డౌన్ కాలం పొడిగించిన నేపథ్యంలో ఆ సమయాన్ని కరోనా వ్యాప్తిని నివారించేందుకు ఉపయోగించుకోవాలని కేంద్రం రాష్ట్రాలకు స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతిసుడాన్ రాష్ట్రాలకు ప్రత్యేక లేఖ రాశారు. హాట్ స్పాట్ జిల్లాలతోపాటు కంటైన్మెంట్ ప్రదేశాల వివరాలను అన్ని రాష్ట్రాలకు పంపారు.
కాగా, తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 19 జిల్లాలు హాట్ స్పాట్ జాబితాలో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ అర్బన్, రంగారెడ్డి, గద్వాల, మల్కాజ్‌గిరి, కరీంనగర్, నిర్మల్ జిల్లాలను హాట్ స్పాట్లుగా గుర్తించింది కేంద్ర ప్రభుత్వం. తెలంగాణలో రెడ్ జోన్ (హాట్‌స్పాట్ క్లస్టర్) జిల్లా: నల్గొండ.

తెలంగాణలో 8, ఏపీలో 11
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు, కర్నూలు, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, నెల్లూరు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలను హాట్ స్పాట్లుగా ప్రకటించింది. మొత్తంగా తెలంగాణలో 8 జిల్లాలను, ఏపీలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు మినహా మిగిలిన 11జిల్లాలను హాట్ స్పాట్లుగా కేంద్రం ప్రకటించింది.

కరోనా జోన్లు ఇలా..
రెడ్ జోన్లో రెండు రకాలు. విస్తృతి ఎక్కువున్నవి 143 (లార్జ్ ఔట్‌బ్రేక్), క్లస్టర్లలో విస్తృతి ఉన్నవి 47 జిల్లాలు. 14 రోజుల్లో కొత్త కేసులు లేకపోతే రెడ్ జోన్ నుంచి ఆరెంజ్ జోన్‌కు.. ఆరెంజ్ నుంచి గ్రీన్ జోన్‌కు మార్పు చేయడం జరుగుతుందని తెలిపింది.

తెలంగాణలో ఆరేంజ్ జోన్లు ఇవే..
తెలంగాణలో ఆరెంజ్ జోన్ (నాన్-హాట్‌స్పాట్) జిల్లాలు: సూర్యాపేట, ఆదిలాబాద్. మహబూబ్‌నగర్, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కుమరంభీమ్ ఆసిఫాబాద్, ములుగు, పెద్దపల్లి, నాగర్ కర్నూలు, మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట. ఇక తెలంగాణలో 600లకుపైగా కరోనా కేసులు నమోదుగా, ఏపీలో 500లకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
-
రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. -
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
Health Insurance: తక్కువ ప్రీమియం.. పెద్ద మోసం! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!!












Click it and Unblock the Notifications