అక్కడ మగవారిని టార్గెట్ చేస్తున్న కాకులు!!
కాకులు మనుషుల్ని టార్గెట్ చేయడం మీరు ఎక్కడైనా విన్నారా? ఒకవేళ విని ఉండకపోతే సిరిసిల్ల జిల్లా కేంద్రానికి వెళ్ళండి? అక్కడ కాకులు ఏం చేస్తున్నాయో? ఎవరిని ఎలా టార్గెట్ చేస్తున్నాయో? మీకే అర్థమవుతుంది. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద కాకలతో జనాలకు పెద్ద సమస్య తయారయింది.
మగవారిని టార్గెట్ చేస్తున్న కాకులు
ఆ బస్టాండ్ దగ్గర బయటకు వెళ్లే వాళ్ళను, లోపలికి వచ్చే వాళ్లను టార్గెట్ చేసుకొని నెత్తి మీద తన్ని వెళుతున్నాయి కాకులు. అయితే అక్కడ కాకులు అందరినీ టార్గెట్ చేయట్లేదు. కేవలం మగవారిని మాత్రమే టార్గెట్ చేసి తలపై తన్ని వెళుతున్నాయి. మహిళలకు మినహాయింపు ఇచ్చి కేవలం మగవారినే టార్గెట్ చేస్తున్నాయి.

చెట్టు క్రిందకు వెళ్తే కాకి తన్నటం గ్యారెంటీ
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కట్ట మైసమ్మ గుడిని ఆనుకుని ఉన్న వేప చెట్టు పైన పదుల సంఖ్యలో కాకులు గూడుకట్టుకుని నివసిస్తున్నాయి. అయితే ఇటీవల కాకుల గూడు నుంచి ఒక కాకి పిల్ల కింద పడిపోవడంతో అప్పటినుంచి చెట్టు కింద నడుస్తున్న మగవాళ్ళ పైన కాకులు దాడి మొదలుపెట్టాయి. ముఖ్యంగా మగవారినే టార్గెట్ చేసి తలపై తన్ని మళ్లీ వెళ్లి చెట్టుకొమ్మపై కూర్చుంటున్నాయి.
కాకులు తలపై తంతున్న క్రమంలో ప్రయాణికుల ఆందోళన
ఇది బస్టాండ్ ప్రాంతం కావడంతో నిత్యం రద్దీగా ఉంటున్న ఇక్కడ కాకులతో జనాలు ఇబ్బంది పడుతున్నారు. అయితే చెట్టు కింద కాకులు దాడి చేస్తున్నాయి అన్న విషయం తెలిసిన కొందరు అటువైపు వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తెలియని వాళ్ళు పొరపాటున అటు వెళ్తే వారి పైన కాకులు దాడి చేస్తున్నాయి. ఊహించని విధంగా కాకులు తలపై కొట్టి వెళుతుండడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారిగా ఉలిక్కి పడుతున్నారు.
కాకులు తలపై తంతే అపశకునం.. జనాల్లో భయం
ఇక తలపై కాకులు తన్నడంతో ఏదో అపశకునం జరుగుతుందని అక్కడివారు లబోదిబోమంటున్నారు. కాకి తలపై తంతే మరణ వార్త వింటారని, ఏడేళ్ల పాటు శని తాండవిస్తుందని చాలామంది నవ్వుతున్నారు. ఈ క్రమంలోనే కాకులు తలపై తన్నుతున్న తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇది విన్న వాళ్లు అంతా ఏంటి కాకి గోల అంటూ నివ్వెర పోతున్నారు.












Click it and Unblock the Notifications