cyber crimes: ఆన్లైన్లో అద్దె ఇంటి కోసం వెతుకుతున్నారా? సైబర్ నేరగాళ్ళు వలేస్తారు జాగ్రత్త!!

రోజురోజుకు సమాజంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. శాంతిభద్రతల పరిరక్షణ కన్నా పోలీసులకు ప్రస్తుతం సైబర్ నేరాలను కట్టడి చేయడం అతి పెద్ద సమస్యగా మారింది. రోజుకో కొత్త మార్గం లో సైబర్ నేరగాళ్లు ప్రజల వద్ద నుండి సొమ్మును కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది అది అని లేకుండా రకరకాలుగా సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు.

ఇల్లు అద్దెకు కావాలని ఆన్లైన్ లో చూస్తున్నారా? ఏం జరుగుతుందంటే

ఇల్లు అద్దెకు కావాలని ఆన్లైన్ లో చూస్తున్నారా? ఏం జరుగుతుందంటే

సాంకేతికత పెరిగిన నేటి రోజుల్లో మనం ప్రతి ఒక్క దానికి ఇంటర్నెట్ పై ఆధార్ పడుతున్నాం. మనకు కావలసిన ఏ సమాచారాన్ని అయినా తెలుసుకోవడానికి గూగుల్ పై ఆధారపడుతున్నాం. ఆఖరుకు ఇల్లు అద్దెకు తీసుకోవాలన్నా ఆన్లైన్ లోనే వెతుకుతున్నాం. ఈ క్రమంలో సైబర్ నేరగాళ్లు ఇల్లు అద్దె కోసం వెతుకుతున్న వారిని కూడా టార్గెట్ చేస్తున్నారు. అందంగా ఉన్న ఇళ్లను, అతి తక్కువ రెంట్ కే అంటూ ఫోటోలు పెట్టి అవసరం ఉన్న వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక తీరా ఇల్లు నచ్చిందని ఎవరైనా అద్దెదారులు వారిని సంప్రదిస్తే, ఇల్లు అద్దెకి తీసుకోవాలనుకుంటే అడ్వాన్స్ గా డబ్బులు చెల్లించమని అడుగుతున్నారు.

ఆన్ లైన్లో అద్దె ఇంటి కోసం అడ్వాన్స్.. ఆపై కథ ఇలా

ఆన్ లైన్లో అద్దె ఇంటి కోసం అడ్వాన్స్.. ఆపై కథ ఇలా

వారు ఇల్లు చూశాక ఇస్తామని చెప్తే మీ కంటే ముందే మరెవరైనా అడ్వాన్స్ ఇస్తే వారికి ఇచ్చేస్తామని చెప్పి వారిపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో తమకు కావలసిన ఏరియాలో, తక్కువ ధరకు ఇల్లు అద్దెకు దొరుకుతుందని, తాము అడ్వాన్సు చెల్లించటం ఆలస్యం చేస్తే వేరే ఇంకెవరైనా తీసుకునే అవకాశం ఉందని సైబర్ మోసగాళ్ళ మాటలు నమ్మి కొందరు ఆన్లైన్లో వారికి అద్దె అడ్వాన్స్ డబ్బులు చెల్లిస్తున్నారు. ఇక ఆ తర్వాత ఆ ఇల్లు, అద్దెకు మాట్లాడిన వాళ్లు ఎవరూ అందుబాటులో లేకుండా పోతున్నారు. అందుకే పోలీసులు ఆన్ లైన్ లో ఇల్లు అద్దెకు తీసుకోవాలని భావిస్తే, మీరు అద్దెకు తీసుకోవాలనుకున్న ఏరియా లో ఉన్న ఇంటిని ఆన్లైన్లో చూసినప్పటికీ, వ్యక్తిగతంగా వెళ్లి ఇల్లు చూసిన తర్వాతే డబ్బులు ఇవ్వాలని చెబుతున్నారు.

నకిలీ ప్రకటనలతో సైబర్ మోసం.. బీ కేర్ ఫుల్

నకిలీ ప్రకటనలతో సైబర్ మోసం.. బీ కేర్ ఫుల్

సైబర్ నేరగాళ్లు నకిలీ ప్రకటనలు పెట్టి మోసం చేస్తున్నారని, అందుకే జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. పొరపాటున కూడా ఆన్లైన్లో ఎవరికీ డబ్బులు చెల్లించవద్దని, మోసాలకు గురి కావద్దని సూచిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా ఆన్లైన్ మోసానికి గురైనట్లుగా గుర్తిస్తే వెంటనే డయల్ 1930 కి ఫోన్ చేసి సమాచారం అందించాలని, తమ ఫిర్యాదును నమోదు చేయాలని సూచిస్తున్నారు. సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని, ఎవరు ఏది చెబితే అది గుడ్డిగా నమ్మొద్దని, ముఖ్యంగా ఆన్లైన్ లో జరుగుతున్న మోసాల పట్ల జాగరూకులై ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు పదే పదే సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+