చిన్న పొరపాటు.. పెద్ద ప్రమాదం.. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల షాకింగ్ వీడియో!
Cyberabad Traffic Police: వాహనాదారులు రోడ్డు భద్రత నియమాలను ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారో.. దాని వల్ల ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో కళ్లకు కట్టేలా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఒక హెచ్చరిక వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో ఒక పాఠశాల బస్సు, ఒక ద్విచక్రవాహనదారుడు చేసిన తప్పిదాలు ఎలా ప్రమాదానికి దారితీషాయో స్పష్టంగా చూపించారు. వీడియోలో చూపిన దాని ప్రకారం.. ఒక ద్విచక్ర వాహనదారుడు ఒక గల్లీ నుంచి ప్రధాన రోడ్డులోకి వస్తున్నాడు. అదే సమయంలో ఓ పాఠశాల బస్సు వేగంగా కాలనీ లోపల నుంచి వస్తోంది.
ఏం తప్పు జరిగింది?:
పాఠశాల బస్సు అతివేగం: కాలనీ లోపల, నివాస ప్రాంతంలో కూడా పాఠశాల బస్సు అతి వేగంతో ప్రయాణించడం మొదటి తప్పు. ఇటువంటి ప్రదేశాలలో నెమ్మదిగా, జాగ్రత్తగా నడపాలి.

ద్విచక్ర వాహనదారుడి నిర్లక్ష్యం: రోడ్డులోకి కలిసే ముందు ద్విచక్ర వాహనదారుడు ఆగి చూడకపోవడం లేదా పరిసరాలను సరిగా గమనించకపోవడం రెండవ తప్పు. ఇలాంటి చోట్ల అజాగ్రత్త ప్రమాదాలకు కారణమవుతుంది.
హెల్మెట్ భద్రత లేకపోవడం: అన్నిటికంటే ముఖ్యంగా, ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ పెట్టుకున్నప్పటికీ, దాని స్ట్రాప్‌ను సరిగా బిగించలేదు. ప్రమాదం జరిగినప్పుడు హెల్మెట్ తల నుంచి జారిపోవడం వల్ల తీవ్ర గాయాలయ్యే అవకాశం ఉంది. వీడియోలో ప్రమాదం జరిగిన వెంటనే హెల్మెట్ ఎలా ఊడిపోయిందో స్పష్టంగా కనిపిస్తుంది.
సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల హెచ్చరిక:
ఈ వీడియో ద్వారా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చారు: "మీ హెల్మెట్‌ను ఎప్పుడూ సురక్షితంగా, గట్టిగా బిగించుకోండి." ఈ సంఘటన రోడ్డు భద్రత నిబంధనలను పాటించాల్సిన ఆవశ్యకతను మరోసారి గుర్తు చేస్తుంది. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రాణాంతకం కావచ్చు. వాహనదారులు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి, దానిని సరిగా బిగించుకోవడం ఎంత ముఖ్యమో ఈ వీడియో తెలియజేస్తుంది. అలాగే, డ్రైవర్లు కూడా కాలనీలు, నివాస ప్రాంతాల్లో వేగాన్ని నియంత్రించుకోవాలని ఈ వీడియో స్పష్టం చేస్తుంది.
Strap it. Slow down. Stay alert. A small precaution can save a life #cyberabadtraffic @SCSC_Cyberabad pic.twitter.com/Lp101wJvPo
— Cyberabad Traffic Police (@CYBTRAFFIC) August 1, 2025












Click it and Unblock the Notifications