బీఆర్ఎస్ సభ్యులపై దానం నాగేందర్ పరుష పదజాలం: రౌడీ షీటర్‌లా అంటూ హరీశ్ ఫైర్
తెలంగాణ శాసనసభలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ సభ్యులపై ఉపయోగించిన పరుష పదజాలంతో గందరగోళం నెలకొంది. శుక్రవారం హైదరాబాద్ అభివృద్ధి కార్యక్రమాలపై అసెంబ్లీలో స్వల్ప కాలిక చర్చ జరిగింది. ఈ చర్చను ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సభ్యులపై దానం నాగేందర్ చేసిన అనుచిత వ్యాఖ్యలతో సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బయట తిరగనియ్యమంటూ పలు పరుష పదాలు ఉపయోగించిన దానం నాగేందర్ బెదిరింపులకు దిగారు. దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సభ్యులు తీవ్రంగా స్పందించారు. అసెంబ్లీ స్పీకర్ పోడియం ముందు ఆందోళనకు దిగారు. పోడియం దగ్గర నిరసన చేస్తున్న బీఆర్ఎస్ సభ్యులపై దానం నాగేందర్ దూసుకెళ్లారు. వెంటనే దానంను కాంగ్రెస్ సభ్యులు వెనక్కి లాగారు.

ఈ క్రమంలో బీఆర్ఎస్ సభ్యులను కేటీఆర్ వెనక్కి తీసుకొచ్చారు. అనంతరం బీఆర్ఎస్ సభ్యులపై చేసిన వ్యాఖ్యలను దానం నాగేందర్ వెనక్కి తీసుకుంటానని, సభాపతికి క్షమాపణలు చెప్పారు. తాను సభలో గతంలో ఎప్పుడూ ఇలా మాట్లాడలేదన్నారు. తాను చేసిన వ్యాఖ్యల పట్ల దానం విచారం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు. తనను రెచ్చగొట్టారని, దీంతో తాను మాట్లాడవలసి వచ్చిందని దానం వివరణ ఇచ్చారు. తన గురించి, తన పనితీరు గురించి అందరికీ తెలుసునన్నారు.
అయినప్పటికీ తాను ఉపయోగించిన పదజాలం హైదరాబాద్, తెలంగాణలో మామూలే అన్నారు దానం. దీంతో మరోసారి బీఆర్ఎస్ సభ్యులు, ఎంఐఎం సభ్యులు అభ్యంతరం తెలిపారు. ఈ నేపథ్యంలో స్పందించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్... దానం వ్యాఖ్యలను పరిశీలించి అవసరమైతే రికార్డుల నుంచి తొలగిస్తామన్నారు. దానం చేసిన వ్యాఖ్యలను ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తప్పుబట్టారు. ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని, క్షమాపణలు చెప్పాలన్నారు.
కాగా, దానం నాగేందర్ మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడంపై బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. దానంకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. దానం వ్యాఖ్యలపై నిరసనగా సభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. ఆ తర్వాత గన్ పార్క వద్ద జాబ్ క్యాలెండర్ లో ఉద్యోగాల సంఖ్యను ప్రకటించకపోవడంపై, దానం వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ సభ్యులు భారీ నిరసన చేపట్టారు.
దుశ్శాసనసభగా మారింది: రౌడీ షీటర్‌లా దానం అంటూ హరీశ్ రావు
తెలంగాణ శాసన సభ దుశ్శాసన సభగా మారిందని విమర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఇందిరమ్మ రాజ్యం అంటే మహిళలకు దక్కే గౌరవం ఇదేనా? అని ప్రశ్నించారు. నిన్న మహిళ ఎమ్మెల్యేలను అవమానపరిచారు. సభ నాయకుడే మా ఎమ్మెల్యేలను తిట్టేపించే ప్రయత్నం చేస్తున్నాడు. దానం నాగేందర్ మాట్లాడే భాష... రౌడి షీటర్ మాట్లాడే భాషలా ఉన్నదంటూ తీవ్రంగా స్పందించారు.
కన్న తల్లులను అవమానపరిచే విధంగా దానం నాగేందర్ వ్యాఖ్యలు ఉన్నాయి.
మాతృత్వం విలువ తెలియని వారు మాత్రమే ఇలా మాట్లాడుతారు. దానం నాగేందర్ సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలి. మా హయంలో మేము ఎన్నడూ చెయ్యలేదు. తెలంగాణ ఉద్యమ సమయంలో దానం నాగేందర్ ఇలానే మాట్లాడాడు.జాబ్ క్యాలెండర్ కాస్త జోక్ క్యాలెండర్ అయిపోయిందని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. .
వృద్దులకు , మహిళలకు 2500 ఇస్తామని చెప్పి మోసం చేశారు. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అశోక్ నగర్ లో రాహుల్ గాంధీ మాట్లాడాడు.
జాబ్ క్యాలెండర్ పై చర్చకు బయపడింది. చర్చ చెయ్యమంటే చెయ్యకుండా పారిపోయారు. నిరుద్యోగలను మోసం చేసినందుకు నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయాలి. కాంగ్రెస్ పార్టీ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే వరకు కాంగ్రెస్ పార్టీనీ వదిలిపెట్టమన్నారు హరీశ్ రావు.
రేవంత్ రెడ్డి అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చాడు. కాంగ్రెస్ ద్రోహాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎండగడుతుంది. దానం నాగేందర్ వెంటనే క్షమాపణ చెప్పాలని అక్బరుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. అక్బరుద్దీన్ ఓవైసీకీ ధన్యవాదాలు. హైదరాబాద్ ఏమైనా దానం నాగేందర్ జాగీరా? ఈ విధంగా మాట్లాడితే హైదరాబాద్‌కు పెట్టుబడులు ఎలా వస్తాయి? తెలంగాణ కోసం పుట్టిన పార్టీ.. పరిపాలన చేతకాదంటే దేశానికి ఒక దిక్సూచి చూపించాడు కేసీఆర్.
జాబ్ క్యాలెండర్ కాస్తా జాబ్ లెస్ క్యాలెండర్ బోగస్ అయింది. శాసన సభ చరిత్రలో ఈరోజు బ్లాక్ డే అని హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ సర్కారు విధానాలకు నిరసనగా బీఆర్ఎస్ సభ్యులు శుక్రవారం రాత్రి గన్ పార్క్ వద్ద భారీ నిరసన చేపట్టారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని తెలంగాణ భవన్‌కు తరలించారు.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications