Danam Nagender:బిగ్ ట్విస్ట్, కౌంట్ డౌన్.. స్పీకర్ తాజా నిర్ణయంతో..!!
మున్సిపల్ ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎమ్మెల్యేల అనర్హత అంశం కొత్త మలుపు తీసుకుంటోంది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి ఫిరాయించారని వారి పైన అనర్హత వేటు వేయాలని గులాబీ పార్టీ నేతలు ఫిర్యాదు చేసారు. ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. కాగా.. ఏడుగురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపు చేయలేదని స్పీకర్ తేల్చి చెప్పారు. మాజీ మంత్రి దానం నాగేందర్ విషయంలో మాత్రం కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. దీంతో.. అనూహ్య నిర్ణయం ఖాయంగా కనిపిస్తోంది.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై దాఖలైన అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ చేసారు. బీఆర్ఎస్ ఫిర్యాదు పైన స్పీకర్ విచారణ సమయంలో అనేక అంశాల పైన ఆరా తీసారు. దానం నాగేందర్ పై సభాపతి అనర్హత వేటు వేస్తారని నమ్ముతున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చెప్పుకొచ్చారు. దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేశారని.. దానం పోటీ చేసిన దానికంటే పెద్ద ప్రూఫ్ ఏముంటుంది? అని ఈ సందర్భంగా ప్రశ్నించారు కౌశిక్ రెడ్డి. అయితే, దానం నాగేందర్ 2024 లోక్‌సభ ఎన్ని క ల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున సికింద్రాబాద్ నుంచి ఎంపీగా బరిలోకి దిగారు. దీంతో ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. దానంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డిలు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ చేసారు.

స్పీకర్ నిర్ణయం పై ఉత్కంఠ
కాగా, ఇదే తరహాలో దానం నాగేందర్ పైన అనర్హత వేటు వేయాలంటూ బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి సైతం ఫిర్యాదు చేసారు. ఈ పిటీషన్ పైనా స్పీకర్ విచారణ చేయాల్సి ఉంది. కాగా.. దానం తరఫు అడ్వకేట్లు.. పాడి కౌశిక్, ఏలేటి మహేశ్వర్ రెడ్డిలను క్రాస్ ఎగ్జామినేషన్ చేసేందుకు సిద్దం అయ్యారు. అయితే ఇప్పటికే దానం నాగేందర్ తన న్యాయవాదుల ద్వారా స్పీకర్‌కు కౌంటర్ దాఖలు చేశారు. తాను బీఆర్ఎస్‌లోనే ఉన్నానని, పార్టీకి రాజీనామా చేయలేదని, బీఆర్ఎస్ తనను సస్పెండ్ చేయలేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ వాదనలు విన్న తరువాత.. బీజేపీ నేతలు తమకు మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యే వరకు సమయం ఇవ్వాలని.. ఆ సందర్భంలో తమ వాదనలు వినిపిస్తామని కోరారు. ఇందుకు అంగీకరించిన స్పీకర్ తదుపరి విచారణ 18వ తేదీన చేపట్టాలని నిర్ణయించారు. ఈ క్రమంలో దానం నాగేందర్ విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కాగా, తాను రాజీనామాకు అయినా సిద్దమేనని.. తనకు ఎన్నికల్లో పోటీ చేయటం.. గెలవటం కొత్త కాదని దానం నాగేందర్ చెబుతున్నారు. దీంతో.. మున్సిపల్ ఎన్నికల తరువాత ఈ వ్యవహారం పైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications