ఆక్రమణల కూల్చివేతలపై దానం నాగేందర్ ఆగ్రహం, హెచ్చరిక
హైదరాబాద్: ఖైరతాబాద్ చింతల్‌బస్తీలో స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ అక్రమ నిర్మాణాను కూల్చివేస్తున్న అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బల్దియా, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా ఖైరతాబాద్ షాదన్ కాలేజీ ఎదురుగా ఫుట్‌పాత్‌పై ఉన్న ఆక్రమణల కూల్చివేతలు చేపట్టారు.
విషయం తెలుసుకున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అక్కడికి చేరుకున్నారు. వెంటనే కూల్చివేతలు ఆపాలని అధికారులను కోరారు. స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాకుండానే ఎలా కూల్చివేస్తారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పొట్టకూటి కోసం జీవనం సాగిస్తున్న పేదవారిపై దౌర్జన్యం చేయడం ఏంటని మండిపడ్డారు.

దావోస్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చే వరకూ కూల్చివేతలు ఆపాలని అన్నారు. కూల్చివేతలు ఆపకపోతే అక్కడే బైఠాయించి ఆందోళన చేస్తానంటూ హెచ్చరించారు. లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
I DON'T CARE IF I LOSE MY MLA POSITION!
— Revathi (@revathitweets) January 22, 2025
I WILL SLEEP IN FRONT OF THE BULLDOZER! 🚜
A visibly angry Khairatabad MLA Danam Nagender was seen arguing with municipal officials on the phone.
He was upset about demolitions being carried out in Chintalbasti opposite Shadan College,… pic.twitter.com/obTRM1dZFc
కాగా, గతంలో దానం నాగేందర్ హైడ్రా కూల్చివేతపైనా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. హైడ్రా కూల్చివేతలు సరికాదన్నారు. హైడ్రాపై కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచించాలని దానం నాగేందర్ సూచించారు.
-
ఏపీ, తెలంగాణాకు కార్మికులకు గండంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం! -
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..?












Click it and Unblock the Notifications