Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విశ్వక్‌సేన్‌ ను హీరోగా గుర్తించటం లేదు - మహిళా సంఘాలతో కేసు పెట్టిస్తాం : దానం నాగేందర్ ఫైర్..!!

విశ్వక్‌సేన్‌- ప్రముఖ టీవీ యాంకర్‌కు మధ్య జరిగిన మాటల యుద్దం ఇప్పుడు మలుపులు తిరుగుతోంది. టీవీ స్టూడియోలో జరిగిన రచ్చ పైన భిన్న స్పందనలు వ్యక్తం అవుతున్నాయి. ఆ వివాదం సమయంలో విశ్వక్‌సేన్‌ పద ప్రయోగం పైన అందరూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దీని పైన ఆ యాంకర్ మంత్రి తలసానికి ఫిర్యాదు చేసింది. దీనికి స్పందించిన ఆయన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇక, ఇప్పుడు ఇదే అంశం పైన మాజీ మంత్రి, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు.

హీరోపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చానళ్లు విశ్వక్‌ సేన్‌ హీరోగా గుర్తిస్తున్నారో లేదో తమకు తెలియదని చెబుతూనే..తాము మాత్రం హీరోగా గుర్తించటం లేదని తేల్చి చెప్పారు. లైవ్‌లో ఇలాంటి అసభ్యకర పదాలు వాడటం కరెక్ట్‌ కాదని వ్యాఖ్యానించారు. మీడియాలో మాట్లాడాల్సిన సమయంలో అనేక ప్రశ్నలు ఎదురవుతుంటాయన్నారు. జవాబు చెప్పే సత్తా ఉన్నప్పుడు మాత్రమే మీడియా ముందుకు రావాలని చెబుతూ.. లేకపోతే సైలెంట్‌గా ఉండాలని వ్యాఖ్యానించారు.

Danam Nagender Sensational comments on Viswksen, demanded for sumoto case

స్టూడియోలో విశ్వక్ సేన్ మాట్లాడిన మాటల మీద పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలని దానం నాగేందర్ డిమాండ్ చేసారు. లేకుంటే మహిళా సంఘాలతో కేసు పెట్టిస్తామని, అతను ఆ మాట అనగానే అదే వేదికపై యాంకర్‌ చెప్పుతో కొట్టేది ఉండే అని ఆయన వ్యాఖ్యానించారు. అలాంటి వ్యక్తులకు బుద్ది చెప్పాల్సిందేనని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇంకోసారి మరెవరు ఇలాంటి పదాలు వాడకుండా చేయాలని అభిప్రాయపడ్డారు.

విశ్వక్ సేన్ లాంటి వాళ్లను సినిమాల్లోకి తీసుకోవద్దని దర్శక నిర్మాతలను కోరుతున్నట్లు పేర్కొన్నారు. కిరోసిన్‌ డబ్బాను పట్టుకుని సినిమా ప్రమోషన్స్‌ చేసుకోవడానికి ఆయన ఏమైన పెద్ద హీరో అనుకుంటున్నాడా అంటూ నిలదీసారు. సోషల్ మీడియాలో ఇప్పుడు విష్వక్సేన్ టీవీ స్టూడియలో చేసిన వ్యాఖ్యలు..ఆ సమయంలో యాంకర్ రియాక్షన్.. ఫిర్యాదుల వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, దానం చేసిన తాజా వ్యాఖ్యలతో ఈ వ్యవహారం మరింత హీటెక్కింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+