వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త విద్యా సంవత్సరం మార్చి 21 నుంచి... ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు

తెలంగాణలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు అకడమిక్ కేలండర్ (ముసాయిదా విద్యా సంవత్సర ప్రణాళిక)ను పాఠశాల విద్యాశాఖ సిద్ధం చేసింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు అకడమిక్ కేలండర్ (ముసాయిదా విద్యా సంవత్సర ప్రణాళిక)ను పాఠశాల విద్యాశాఖ సిద్ధం చేసింది.

2017-18 విద్యా సంవత్సరాన్ని మార్చి 21 నుంచి ప్రారంభించాలని, అలాగే వేసవి సెలవులను ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు నూతన అకడమిక్ కేలండర్ ను ఉపాధ్యాయ సంఘాలకు పంపించింది.

 Dasara Holidays For Telangana Schools From September 30 To October 12

ఈ ప్రణాళికపై ఆయా సంఘాలతో చర్చించి, మార్పు చేర్పులతో ఖరారు చేయనుంది. వేసవి సెలవుల అనంతరం జూన్ 12న పాఠశాలల్ని తిరిగి ప్రారంభించనుంది. ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉదయం 9:30 గంటలకు.. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉదయం 9:00 గంటల నుంచి ప్రారంభించాలని ప్రతిపాదించింది.

స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు జులై, ఆగస్టు, సెప్టెంబరు, నవంబరు, జనవరి, ఫిబ్రవరి నెలల్లో జరుగనున్నాయి. ఇక వచ్చే ఏడాది పదో తరగతి ప్రీఫైనల్ పరీక్షలను 2018 ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు లేదా ఫిబ్రవరి 21 నుంచి మార్చి 6 వరకు నిర్వహిస్తారు.

English summary
According to the latest academic calendar issued by the Education Department, the next school year will start right from March 21, 2017. Dasara holidays for public, private and aided schools in the state from September 20 to October 4.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X