లోకల్ వార్ కు ముహూర్తం ఖరారు .. 22 న నోటిఫికేషన్ ?
Recommended Video

జెడ్పీటీసీ , ఎంపీటీసీ ఎన్నికల నిర్వాహణకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి . ఏప్రిల్ 22న మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది. 22 నుండి మే 14 వరకు పరిషత్ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికనుగుణంగా ఎన్నికల అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

జెడ్పీటీసీ , ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై సీఎం కేసీఆర్ సమీక్ష
ఏప్రిల్ 12వ తేదీ శుక్రవారం జెడ్పీటీసీ , ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై పంచాయతీ రాజ్ శాఖ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. ఈ సమావేశంలో మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వాహణ ఏర్పాట్లు, ఎన్ని దఫాలుగా ఎన్నికలు నిర్వహించాలి తదితర అంశాలపై చర్చించారు. సమావేశంలో జరిగిన చర్చ ను బట్టి మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తోందని తెలుస్తోంది

త్వరలో రిటర్నింగ్ అధికారులకు శిక్షణా కార్యక్రమాలు
ఇక స్థానిక సంస్థల ఎన్నికల విధులు నిర్వహించే రిటర్నింగ్ అధికారుల, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు ఇప్పటికే ఆర్డర్లు పంపారు . ఆర్ధర్లు అందుకున్న టీచర్లకు ఏప్రిల్ 15 నుండి 26వ తేదీల్లో ఏదో ఒక రోజు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, సీఈవోలు, డీపీవోలు, ఎంపీడీవోలతో ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్‌లతో సమీక్ష నిర్వహిస్తున్నారు ఎన్నికల అధికారులు.

లోక్ సభ ఫలితాలలోపే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసే యోచన
దీనికి సంబంధించిన ఏర్పాట్లపై ఏప్రిల్ 15న సీఎస్, డీజీపీలతో, ఏప్రిల్ 18న జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సీఈవోలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. మే 23న లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతుండగా ఆ లోగానే పరిషత్ ఎన్నికలు పూర్తి చేయాలని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు .
-
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్! -
ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!












Click it and Unblock the Notifications