ప్రియమైన మోడీ జీ..అచ్చేదిన్; మీరు బాగా చేశారు సర్: కేటీఆర్ ఆసక్తికర ట్వీట్

తెలంగాణ రాష్ట్రంలో అధికార టిఆర్ఎస్ పార్టీకి, కేంద్రంలోని అధికార బిజెపికి మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్ కేంద్ర ప్రభుత్వం అన్నట్టుగా ఇద్దరి మధ్య మాటలు యుద్ధం కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు చెక్ పెట్టి కాషాయ జెండా ఎగురవేయాలని బిజెపి తెలంగాణ రాష్ట్ర నాయకులు, బిజెపి అగ్రనేతలు శతవిధాలా ప్రయత్నం చేస్తుంటే, తెలంగాణలో బిజెపి ఆటలు సాగనివ్వబోమని పదే పదే తేల్చి చెబుతున్నారు టిఆర్ఎస్ పార్టీ మంత్రులు, నేతలు.

ఇక ఈ కోవలో ముందు వరుసలో నిలిచిన మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వ తీరుపై, మోడీ పాలన పై సోషల్ మీడియా వేదికగా నిత్యం విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి మోడీ సర్కార్ చేస్తున్న అన్యాయాన్ని చెప్పి, కేంద్ర ప్రభుత్వ వివక్షను టార్గెట్ చేస్తున్నారు మంత్రి కేటీఆర్. తాజాగా ట్విట్టర్ వేదికగా మరోమారు ప్రధాని మోడీ పై ఐటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అచ్చే దిన్ అంటూ ఇచ్చిన పిలుపుకు నేటితో 8 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని మంత్రి కేటీఆర్ మోడీ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ప్రధాని మోడీ అచ్చే దిన్ కు 8 ఏళ్లు నిండాయని పేర్కొన్న కేటీఆర్ ఈ ఎనిమిది సంవత్సరాలలో మోడీ సర్కార్ సాధించిందేమిటి అన్న వాటిని ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో మంత్రి కేటీఆర్ ప్రియమైన మోడీ జీ.. ఈ ఎనిమిదేళ్లలో రూపాయి విలువ అత్యంత కనిష్ట స్థాయికి చేరిందని, 45 ఏళ్లలో అత్యధిక నిరుద్యోగం ఇప్పుడు దాపురించిందని పేర్కొన్నారు. 30 ఏళ్లలో అత్యధిక ద్రవ్యోల్బణం ఇప్పుడు నెలకొందని, ప్రపంచంలోనే అత్యధిక ఎల్పిజి ధర ఉందని పేర్కొన్నారు.

Dear Modi ji..welldone for your Achche Din; KTR Interesting tweet

42 ఏళ్లలో అత్యంత అధ్వాన్నమైన ఆర్థిక వ్యవస్థను చూస్తున్నామని పేర్కొని.. మీరు బాగా చేశారు సార్ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేంద్రంలోని బిజెపి హయాంలో దేశ ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైందని తన ట్విట్టర్ పోస్ట్ ద్వారా మంత్రి కేటీఆర్ తెలియజెప్పే ప్రయత్నం చేశారు. ఇంతకు ముందు కూడా ప్రధాని మోడీని టార్గెట్ చేసిన కేటీఆర్ మోడీ గుజరాత్ కే కాదు దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆయన ప్రధాని అన్న విషయం గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+