మహిళలు ఉండగానే ఇళ్ల కూల్చివేతలా?: కేటీఆర్ వీడియో ట్వీట్

హైద‌రాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రేవంత్ ప్రభుత్వం చేప‌ట్టిన కూల్చివేత‌ల‌పై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీని కేటీఆర్ ప్ర‌శ్నించారు. మనుషులు ఉండగానే ఇళ్లు కూల్చివేస్తారా? అని మండిపడ్డారు.

ఇలాంటి ఘ‌ట‌న‌లు మీ కుటుంబంలో జ‌రిగితే, అంగీక‌రించ‌గ‌ల‌రా..? రాహుల్ గాంధీ జీ అంటూ కేటీఆర్ ఎక్స్ వేదికగా నిలదీశారు. ప‌ట్టింపు, మాన‌వ‌త్వం లేని ప్ర‌భుత్వాలే ఇలాంటి చ‌ర్య‌లకు పాల్ప‌డుతాయని మండిపడ్డారు. తెలంగాణ‌లో ఇంట్లో ఇద్ద‌రు మ‌హిళ‌లు ఉండ‌గానే.. బుల్డోజ‌ర్ల‌తో ఆ ఇండ్ల‌ను కూల‌గొట్టారు. మ‌రి వారి భౌతిక భ‌ద్ర‌త‌కు ఎవ‌రూ బాధ్య‌త వ‌హిస్తార‌ని నిలదీశారు. పేద‌ల‌కు ప్రేమ పంచుతాం అన‌డం అంటే ఇదేనేమో అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

Demolishing houses while people are still there KTR s question to Rahul Gandhi

మరోవైపు, గురుకులాల అంశంపైనా కేటీఆర్ స్పందించారు. బీఆర్ఎస్ గురుకుల బాటతో కాంగ్రెస్ సర్కారులో ఎట్టకేలకు చలనం వచ్చిందన్నారు. సంక్షేమ పాఠశాలలను సంక్షోభ పాఠశాలలుగా మార్చి..
సామాన్య విద్యార్థుల్లో భయాందోళనలు, తల్లిదండ్రులలో ఆవేదన రేపారని మండిపడ్డారు. పాఠాలు చెప్పే చోట పాము కాట్లతో పసిబిడ్డల ప్రాణాలు పోయాయని అన్నారు.

బీఆర్ఎస్ పాలనలో విద్యార్థులు ఎవరెస్టు వంటి శిఖరాలను అధిరోహిస్తే .. ఏడాది కాంగ్రెస్ పాలనలో ఆసుపత్రి బెడ్లను ఎక్కించారంటూ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో గురుకుల విద్యాలయాల్లో సీట్ల కోసం పోటీ .. ఏడాది కాంగ్రెస్ పాలనలో ఆసుపత్రిలో బెడ్ల కోసం పోటీ అంటూ ఎద్దేవా చేశారు.

దొంగలు పడ్డ ఆరు నెలలకు అన్నట్టు ఇప్పుడు గురుకులాల బాటపట్టారు.
గురుకులాల మొక్కుబడి సందర్శన కాదు .. ఆ విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టండి. ఫోటోలకు పోజులు ఇవ్వడం కాదు-పట్టెడు పనికొచ్చే బువ్వ పెట్టి పొట్టలు నింపండి. కెమెరాల ముందు హంగామా చేసుడు కాదు-గురుకుల బిడ్డల గుండెచప్పుడు వినండి. మంది మార్బలంతో దండయాత్ర చేయకండి- గురుకుల సమస్యలను తీర్చే ప్రయత్నం చేయండి. ఎట్లుండె తెలంగాణ.. ఎట్లాయె తెలంగాణ అంటూ సోషల్ మీడియా వేదిక వ్యాఖ్యానించారు కేటీఆర్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+