ఇందిరమ్మ ఇల్లు సగం కట్టి ఆపేశారా? హెచ్చరిక!

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్ల చొప్పున నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ప్రతి నియోజకవర్గంలోనూ ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ళ పథకం ద్వారా ఇల్లు కట్టుకోవడానికి కావలసిన మెటీరియల్ ను ఇవ్వడంతో పాటు ఆర్థిక భరోసాని కూడా అందిస్తోంది ప్రభుత్వం. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.

ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణంపై కలెక్టర్ల దృష్టి
ప్రతి జిల్లాలోనూ కలెక్టర్లు స్వయంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల తీరును పరిశీలించి లబ్ధిదారులకు సలహాలు, సూచనలు ఇస్తూ పనులను వేగవంతంగా జరిగేలా చూస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు నిబంధనలు మేరకు మాత్రమే ఇల్లు కట్టుకోవాలని సూచిస్తున్నారు. నిబంధనలు అతిక్రమించి ఇళ్ల నిర్మాణం చేస్తే వారికి బిల్లులు రావని లబ్ధి చేకూరదని చెబుతున్నారు. ఇక తాజాగా మరొక కీలక విషయాన్ని కూడా జిల్లా కలెక్టర్లు ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు చెబుతున్నారు.

Did Indiramma houses get stopped halfway through construction Warning

Take a Poll

ఇల్లు కట్టకుంటే తరువాత జాబితాలో వాళ్లకు ఇస్తామన్న కలెక్టర్
ఇల్లులేని నిరుపేదలు చాలామంది ఉన్నారని, వారంతా ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నారని, ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టిన వాళ్ళు, నిర్మాణాలు పూర్తి చేయకుంటే వారికి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని క్యాన్సిల్ చేసి, కట్టుకోవడానికి ఆసక్తి ఉన్నవారికి కేటాయిస్తామని చెబుతున్నారు. తదుపరి జాబితాలో వాళ్లకు ఇస్తామని, ఆలస్యం చేయకుండా లబ్ధిదారులు త్వరగా పూర్తి చేసుకోవాలన్నారు. తాజాగా ఈ విషయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న క్రమంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు.

అధికారులతో క్షేత్ర స్థాయిలో ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన కలెక్టర్
హనుమకొండ జిల్లాలో పైలట్ గ్రామాలైన హసన్ పర్తి మండలం పెంబర్తి, ఎల్కతుర్తి , వీర నారాయణపూర్ లో పురోగతిలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఇంకా ఇల్లు మొదలు పెట్టని, బేస్మెంట్ వరకు వచ్చి ఆగిన ఇండ్ల వివరాలను కలెక్టర్ ఆరా తీశారు. కలెక్టర్ మాట్లాడుతూ పైలెట్ గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు మొదలుపెట్టి ఆరు నెలలు అవుతుందని, నిర్మాణ పనులు వేగంగా సాగాలన్నారు.

ఇండ్ల నిర్మాణ పనులు అలాగే నిలిపివేస్తే చర్యలు
బేస్మెంట్ వరకు వచ్చిన ఇండ్ల నిర్మాణ పనులు మరింత ముందుకు సాగాలని, లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణ పనులు అలాగే నిలిపివేస్తే తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ఇండ్ల నిర్మాణ పనులు ముందుకు సాగకపోతే వాటిని క్యాన్సిల్ చేసి తదుపరి జాబితాలోని అర్హులకు ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తామన్నారు. లబ్ధిదారులు త్వరగా పూర్తి చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+