రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అధికారిక వెబ్సైట్లలో డిజిటల్ విధ్వంసం

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన పైన సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరుగుతున్నారు. తాజాగా ఆయన రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లతో పాటు సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ముఖ్యమైన సమాచారం తొలగిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయంలో సిఎస్ శాంతి కుమారి తక్షణమే జోక్యం చేసుకోవాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

ముఖ్యమైన సమాచారం తొలగింపు
2023 డిసెంబర్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లు మరియు సోషల్ మీడియా హ్యాండిల్స్ లోని ముఖ్యమైన సమాచారాన్ని కనిపించకుండా చేశారని, కొన్ని ముఖ్యమైన వెబ్సైట్లను పూర్తిగా తొలగించారని ప్రభుత్వ ఏర్పాటు ప్రారంభంలో మెయింటెనెన్స్ ఇష్యూ పేరుతో ప్రముఖ సైట్లను ప్రజలకు దూరంగా ఉంచారని ఆయన ఆరోపించారు. అయితే ఇది ఉద్దేశపూర్వకంగానే చేసినట్టు కనిపిస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు.

Digital vandalism in Revanth reddy govt KTR said what is happening in official websites

కొన్ని వెబ్ సైట్ లనే తొలగించారు
ఈ వెబ్సైట్ల నుంచి ముఖ్యమైన సమాచారం అదృశ్యం కావడం వెనుక పాలకుల హస్తం ఉందని ఆయన ఆరోపించారు.వెబ్సైట్లను తొలగించడం వెనుక ఏం జరుగుతుందో అన్న అనుమానాలు ఉన్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ వరకు కేసీఆర్ సీఎంగా పరిపాలన సాగించారని కెసిఆర్ పరిపాలనకు సంబంధించిన సమాచారాన్ని వేల కొలది ఫోటోలు, వీడియోలను వెబ్సైట్లు సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించారని కేటీఆర్ ఆరోపించారు.

కాంగ్రెస్ పాలనలో డిజిటల్ విధ్వంసం
రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని భద్రపరచాలి కానీ ఇలా తొలగించడం సరికాదంటూ కేటీఆర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో డిజిటల్ విధ్వంసం కొనసాగుతుందని కేటీఆర్ ఆరోపించారు. ఈ డిజిటల్ కంటెంట్ ప్రజలు అందించిన నిధులతో సమకూర్చిందని కొత్త ప్రభుత్వం తమ అధికారిక వెబ్సైట్లో ఈ కంటెంట్ ఉండకూడదు అని భావిస్తే దానిని ఆర్కైవ్ చేసి భద్రపరచాలి కానీ పూర్తిగా తొలగించకూడదన్నారు.

సీఎస్ కు కేటీఆర్ రిక్వెస్ట్
విలువైన ఈ ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడాన్ని భావితరాలు క్షమించవన్నారు కేటీఆర్..తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రాష్ట్రంలో ఉన్న భౌతిక, డిజిటల్ ఆస్తులను రక్షించే బాధ్యత మీపై ఉందని సిఎస్ శాంతి కుమారిని ఉద్దేశించి పేర్కొన్న కేటీఆర్, ఏ ఏ వెబ్సైట్లలో, సోషల్ మీడియా హ్యాండిల్స్ లో సమాచారాన్ని తొలగించారో వివరణాత్మకంగా లేఖను పంపుతాను అన్నారు. ఈ సమస్యకు తక్షణ పరిష్కారాన్ని ఆశిస్తున్నానని కేటీఆర్ తన పోస్ట్ లో పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+