పొంగులేటి, జూపల్లి బాటలో ఆ కీలక నేతలు; కేసీఆర్ ఏం చెయ్యనున్నారు?
తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేయాలని ప్లాన్ చేసి బలమైన నాయకులను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్న కెసిఆర్ వ్యూహం బెడిసి కొడుతుందా? పార్టీలో పాతా కొత్త నేతల మధ్య ఉన్న విభేదాలు ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో పార్టీకి తలనొప్పిగా తయారయ్యాయా? ఫిరాయింపు ఎమ్మెల్యేలను ప్రోత్సహించడం కెసిఆర్ కు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టిందా? అంటే అవును అన్న సమాధానమే వస్తుంది.
ఒక పక్క తెలంగాణ రాష్ట్రంలో బలంగా బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ప్రజాక్షేత్రంలోకి వెళుతూ ప్రజల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తుంటే, మరొక బిఆర్ఎస్ ప్రతిపక్షాలను దీటుగా ఎదుర్కొనే మాట అటు నుంచి స్వపక్షంలోనే ఉన్న అంతర్గత కలహాలతో సతమతమవుతుంది. మొదటి నుంచి బీఆర్ఎస్ కోసం పనిచేసిన నాయకులు, మధ్యలో కాంగ్రెస్, బిజెపి వంటి ఇతర పార్టీల నుండి వచ్చి చేరిన నాయకుల మధ్య ఆధిపత్య పోరు రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాలలో దాదాపుగా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో పరిస్థితులు మరీ దారుణంగా తయారయ్యాయి. అక్కడ నేతల మధ్య ఆధిపత్య పోరు పార్టీకి నష్టం చేసేలా కనిపిస్తుంది.

వచ్చే ఎన్నికలలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇస్తానని సీఎం కేసీఆర్ క్లారిటీ ఇవ్వడంతో, టికెట్ కోసం ఆశ పెట్టుకున్న గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన బీఆర్ఎస్ నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అయితే కెసిఆర్ అవసరాన్ని బట్టి నిర్ణయం మార్చుకునే అవకాశం కూడా ఉంది అని ఆలోచిస్తున్న వారు, నియోజకవర్గంలో పట్టు కోసం పోటాపోటీగా పనిచేస్తున్నారు. సిట్టింగులకు చెక్ పెట్టి టికెట్ తెచ్చుకోవాలనే ఆలోచనలో ఎవరికి వారు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాలలో పరిస్థితి అధికార పార్టీలోనే నేతల మధ్య ఉప్పు నిప్పులా తయారైంది.

ఇక తాజాగా బి ఆర్ ఎస్ పార్టీ నుండి జూపల్లి కృష్ణారావును, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని సస్పెండ్ చేయడం, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్చకు కారణమైంది. టిఆర్ఎస్ పార్టీలో చాలామంది అసంతృప్తులు ఉన్నారని, వారందరినీ ఏకతాటి మీద తీసుకువచ్చి బిఆర్ఎస్ ని ఓడించడమే ధ్యేయంగా పనిచేస్తామని జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించడంతో ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి బి ఆర్ ఎస్ లోకి ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలలో అంతకు ముందు నుండే బి.ఆర్.ఎస్ కోసం కీలకంగా పనిచేస్తున్న నేతలు పక్క చూపులు చూస్తున్నట్లుగా తెలుస్తుంది.
అసమ్మతి నేతలందరూ జట్టు కడితే ఆయా నియోజకవర్గాలలో మొదటికే మోసం వస్తుందని భావిస్తున్న బిఆర్ఎస్ దిద్దుబాటు చర్యలను చేపట్టాలని భావిస్తుంది. పట్నం మహేందర్ రెడ్డి , తీగల కృష్ణారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వంటి నాయకులు ఇప్పటికే తీవ్రమైన అసహనంతో ఉన్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల ఉన్న నాయకులు అందరూ తమ అసంతృప్తిని బయటపడితే బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికర వాతావరణ చోటు చేసుకుంటుంది. కాబట్టి వీరందరిని సముదాయించడానికి, అందరినీ ఏకతాటి మీదికి తీసుకురావడానికి అధినేత కేసీఆర్ ఏం చేయబోతున్నారు అన్నది ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications