అనూహ్య పరిణామం- డిస్నీ-హాట్ స్టార్ చేతికి రామోజీ ఫిల్మ్ సిటీ- మూడేళ్ల అద్దెకు..
కరోనా నేపథ్యంలో ఓడలు బండ్లు అవుతూనే ఉన్నాయి. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పలు దిగ్గజ సంస్దల మూలాలను కరోనా సంక్షోభం కుదిపేస్తుండగా... తాజాగా హైదరాబాద్ లోనూ ఈ ప్రభావం పడింది. ఒకప్పుడు ఉమ్మడి తెలుగు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో భారీ ఓపెన్ ఫిల్మ్ స్టూడియోగా పేరు తెచ్చుకున్న రామోజీ ఫిల్మ్ సిటీ ఇప్పుడు కరోనా సంక్షోభంలో చిక్కుకుంది.

రామోజీ ఫిల్మ్ సిటీపై కరోనా దెబ్బ..
ఒకప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద ఫిల్మ్ సిటీగా పేరు తెచ్చుకున్న రామోజీరావు మానసపుత్రిక లాక్ డౌన్ దెబ్బకు భారీగా కుదేలైనట్లు తెలుస్తోంది. 2003లో ప్రారంభమై టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మల్లూవుడ్ మూవీ షూటింగ్ లకు కేంద్ర బిందువుగా నిలిచిన ఫిల్మ్ సిటీని ప్రధాని మోడీతో పాటు పలువురు వీఐపీలు, కేంద్రమంత్రులు, క్రీడాకారులు సందర్శించి కితాబిచ్చారు. కానీ కరోనా కారణంగా లాక్ డౌన్ ప్రారంభం అయినప్పటి నుంచి ఫిల్మ్ సిటీలో అన్ని కార్యకలాపాలు బంద్ అయ్యాయి.

నాలుగు నెలలైంది.. నాలుగు నెలలుగా బంద్...
దాదాపు నాలుగు నెలలుగా ఫిల్మ్ సిటీలో పనులేమీ లేకపోవటంతో ఫిల్మ్ సిటీ యాజమాన్యం అక్కడ పనిచేసే సిబ్బందిలో దాదాపు అరవై శాతం ఉద్యోగుల వరకూ నో వర్క్-నో పే విధానాన్ని అమలు చేస్తోంది. తప్పనిసరిగా ఉండాల్సిన సిబ్బందిని మాత్రమే ఉద్యోగాలకు రానిస్తున్నారు. దాదాపు నాలుగు నెలలుగా ఫిల్మ్ సిటీ కార్యకలాపాలు నిలిచిపోవటం..కరోనా ఖతం అయ్యేది ఎప్పుడో ఎవరికీ క్లారిటీ లేకపోవటంతో ఫిల్మ్ సిటీ యాజమాన్యం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు కన్పిస్తోంది.

బయట షూటింగ్స్ కు డిస్నీ నో....
రామోజీ ఫిల్మ్ సిటీని అద్దెకు తీసుకున్న హాట్ స్టార్-డిస్నీ సంస్థ ఇతర నిర్మాణ సంస్థల షూటింగ్ లకుఅనధికారికంగా అనుమతులు నిలిపివేస్తున్నట్లు ‘రిపబ్లిక్ వరల్డ్.కామ్' తెలిపింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ఫిల్మ్ సిటీని చేతిలో పెట్టుకోవటం ద్వారా రాబోయే రోజుల్లో సొంత ఓటీటీ ఫ్లాట్ ఫామ్ తోపాటు ఇతర కంటెంట్ క్రియేట్ చేయటం ద్వారాఇతరుల కంటే చాలా మెరుగైన పొజిషన్ లో ఉంటామని ఆ కంపెనీ భావిస్తోంది. గత ఏడాది హాట్ స్టార్ ను డిస్నీ టేకోవర్ చేసుకుంది. ఈ విలీనంతో హాట్ స్టార్ అత్యంత శక్తివంతమైన ఓటీటీ సంస్థగా అవతరించింది. ఇదిలా ఉంటే ప్రపంచంలోనే అతి పెద్ద బ్రాండ్ అయిన డిస్నీ ఫిల్మ్ సిటీని పర్యాటక పరంగా..సినిమా, షూటింగ్ ల కోసం ఉపయోగించుకోనుంది. ఈ ఒప్పందం తర్వాత ప్రాజెక్టులో మరిన్ని మార్పులు జరుగుతాయని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications