పాస్ పోర్ట్ బ్రోకర్,దుబాయ్ శేఖర్.. బూతుపురాణం మానుకోకపోతే కేసీఆర్ నాలుక తెగ్గోస్తాం: డీకే అరుణ

తెలంగాణ సీఎం కేసీఆర్ పై బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో సీఎం కేసీఆర్ నిన్న కేంద్రంపై, దేశ ప్రధాని నరేంద్ర మోడీపై చేసిన వ్యాఖ్యలపై డీకే అరుణ కౌంటర్ ఇచ్చారు. బుధవారం మీడియాతో మాట్లాడిన డీకే అరుణ అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చి కెసిఆర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తామంటే కుదరదని తేల్చి చెప్పారు. దళితులను మోసం చేసి కెసిఆర్ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారని డీకే అరుణ విమర్శించారు.

 అవినీతి సామ్రాట్ వు నువ్వే కేసీఆర్

అవినీతి సామ్రాట్ వు నువ్వే కేసీఆర్


అవినీతి సామ్రాట్ నీవు కేసీఆర్ అంటూ విరుచుకుపడిన డీకే అరుణ ప్రధానమంత్రి పై మాట్లాడే స్థాయి నీకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం ఏం పీకావో చెప్పాలంటూ డీకే అరుణ ఘాటుగా వ్యాఖ్యానించారు. పన్నెండు వందల మంది పిల్లల ప్రాణాలు తీసుకుని సీఎం సీట్లో కూర్చున్నావని, కొంచెం అయినా సిగ్గు శరం ఉండాలి అని డీకే అరుణ కెసిఆర్ ని దుయ్యబట్టారు. తెలంగాణా అమరుల త్యాగాల పునాది మీద కేసీఆర్ సామ్రాజ్యం కట్టుకున్నారన్నారు. నీ ఆలోచనే దోపిడీ.. నువ్వు ఓ దోపిడీ దారుడివి అంటూ డీకే అరుణ విమర్శల వర్షం కురిపించారు.

పిచ్చి కుక్కలా మాట్లాడుతున్నావ్

పిచ్చి కుక్కలా మాట్లాడుతున్నావ్

పిచ్చెక్కి పిచ్చి కుక్కలా మాట్లాడుతున్నావ్ అంటూ తిట్టిపోశారు. మెంటల్ ఆస్పత్రులు నీలాంటి వారి కోసమే అన్నారు. నీవి ముదనష్టపు ఆలోచనలు అంటూ మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్ ను జీర్ణించుకోలేక మాట్లాడుతున్నాడని కెసిఆర్ పై అసహనం వ్యక్తం చేశారు. వేల కోట్ల రూపాయలను ఎన్నికల జరుగుతున్న రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు కెసిఆర్ పంపుతున్నారని డికె అరుణ ఆరోపించారు.

బూతు పురాణం మానుకోకపోతే కేసీఆర్ నాలుక తెగ్గోస్తాం

బూతు పురాణం మానుకోకపోతే కేసీఆర్ నాలుక తెగ్గోస్తాం

బూతు పురాణం మానుకోకపోతే కేసీఆర్ నాలుక తెగ్గోస్తాం అని డీకే అరుణ హెచ్చరించారు. కల్వకుంట్ల చంద్రశేఖర రావు కాదు కంత్రీ చంద్రశేఖర రావు అంటూ వ్యాఖ్యానించారు. పాస్ పోర్ట్ బ్రోకర్, దుబాయ్ శేఖర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్నటి బడ్జెట్ దేశం కోసం పెట్టిందని, నీకోసం పెట్టింది కాదంటూ చురకలంటించారు. నీ అవినీతి సొమ్మును ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ పంపుతున్నావ్ అంటూ కెసిఆర్ పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు డీకే అరుణ.

చిల్లర భాషా ,కంత్రి వేషాలు కేసీఆర్ వి

చిల్లర భాషా ,కంత్రి వేషాలు కేసీఆర్ వి


వ్యాపారం చేసి అంబానీలు, ఆదానీలు డబ్బు సంపాదిస్తే, నువ్వు వాళ్ళను మించిపోయావని, అవినీతి చేసి డబ్బు సంపాదిస్తున్నావని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసి రెండోసారి అధికారంలోకి కెసిఆర్ వచ్చారని డీకే అరుణ పేర్కొన్నారు. చిల్లర భాషా ,కంత్రి వేషాలు కేసీఆర్ వని డీకే అరుణ నిప్పులు చెరిగారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఎక్కడ అని ప్రశ్నించారు డీకే అరుణ. తెలంగాణ రాష్ట్రంలో నీళ్లన్నీ వాడుకుంటున్నావా.. ఎన్ని ప్రాజెక్టులు కట్టావు అంటూ డీకే అరుణ ప్రశ్నించారు.

దేశ ప్రధాని పై పిచ్చి పట్టినట్టు కెసిఆర్ వ్యాఖ్యలు

దేశ ప్రధాని పై పిచ్చి పట్టినట్టు కెసిఆర్ వ్యాఖ్యలు


కెసిఆర్ కిట్ లో కేంద్ర నిధులు ఉన్నాయని పేర్కొన్న డీకే అరుణ కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర పథకాలకు వాడుకుంటున్నాడు అని ఎద్దేవా చేశారు. మహిళా ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పై కెసిఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని డీకే అరుణ తెలిపారు. దేశ ప్రధాని పై పిచ్చి పట్టినట్టు కెసిఆర్ మాట్లాడుతున్నాడని డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానిపై వ్యాఖ్యలు చేసే అర్హత, స్థాయి కేసీఆర్ కు లేవని డీకే అరుణ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+