తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ గా డీకే - సీనియర్ల పక్కా ప్లాన్, రేవంత్ కు చెక్..!?

తెలంగాణ ఎన్నికల వేళ కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కర్ణాటక ఎన్నికల ఫలితాల తరువాత తెలంగాణ పైన ఆశలు పెట్టుకుంది. తెలంగాణలో బీజేపీ బలం పెరగకూడదని భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కి ప్రధాన పోటీ దారు తామేనని భావిస్తోంది. ఈ సమయంలో పార్టీలో అంతర్గత విభేదాలకు చెక్ పెట్టాలని నిర్ణయించింది. పార్టీలోని సీనియర్లకు సన్నిహితుడైన ప్రస్తుత కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు పార్టీ ఇంఛార్జ్ గా నియమించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

డీకేకు తెలంగాణ బాధ్యతలు:తెలంగాణలో కాంగ్రెస్ కొత్త అస్త్రాలను సిద్దం చేస్తోంది. కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ కు తెలంగాణ పార్టీ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. రాజకీయ వ్యూహాల్లో డీకే కు పట్టు ఉంది. అదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లకు డీకేతో సత్సంబంధాలు ఉన్నాయి.

DK Shiva Kumar lilkely to appoint as Telangana Congress incharge ahead sate Assembly Elections as reports

రేవంత్ నాయకత్వం..విభేదిస్తున్న సీనియర్లు కర్ణాటక ఎన్నికల తరువాత డీకేకు తెలంగాణ బాధ్యతలు అప్పగించాలని ప్రతిపాదించారు. డీకే సమర్ధత పైన నమ్మకం ఉన్న అధిష్ఠానం ఆయన వైపు మొగ్గు చూపుతోంది. ఇతర పార్టీల నేతల చేరితో పాటుగా సీనియర్ల సమన్వయం..ఎన్నికల వ్యూహాల బాధ్యతలను డీకేకు అప్పగించేందుకు రంగం సిద్దమైంది.

ఇప్పటికే డీకే సూచనలతో:ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ వ్యూహాలను తిప్పి కొట్టాలంటే తెలంగాణ కాంగ్రెస్ లో సమర్ధవంతంమైన నేత కావాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఈ సమయంలో పార్టీ అంతర్గత వ్యవహారాలను చక్కదిద్ది నాయకులను, కేడర్‌ను ఏకతాటిపైకి తీసుకెళ్లే విధంగా డీకే సేవలు ఉపయోగపడుతాయని అంచనా వేస్తున్నారు.

అంతేకాకుండా ఆర్థిక పరమైన వనరులను సమర్థంగా ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతో కూడా పార్టీ అధిష్ఠానం ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇప్పటికే పార్టీకి చెందిన పలువురు నేతలు డీకేతో టచ్‌లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ మధ్య టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు, కాంగ్రెస్‌ పార్టీలోకి రావాలని భావిస్తున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, దామోదరరెడ్డి వంటి వారు వేర్వేరుగా బెంగుళూరు వెళ్లి డీకేతో సమావేశమయ్యారు.డీకే హామీతో వారు పార్టీలో చేరేందుకు అంగీకరించారు.

సమన్వయం..వ్యూహాలు:డీకే శివకుమార్‌ నియామకం ద్వారా అనేక ప్రయోజనాలు కలుగుతాయని కాంగ్రెస్‌ అధిష్ఠానం అంచనా వేస్తోంది. పార్టీలో సీనియర్ల మధ్య సమన్వయం కుదరడం లేదు. పార్టీ వేగంగా ముందుకు వెళుతున్న ప్రతిసారీ ఈ అంతర్గత విభేదాలతో తలనొప్పులు ఎదురవుతున్నాయి. మరోపక్క ఇతర పార్టీలకు చెందిన సీనియర్‌ నేతల చేరికల విషయంలో కూడా తుది నిర్ణయానికి రాలేకపోతున్నారు.

ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ పరిస్థితిని మార్చాలనే ఉద్దేశంతో అధిష్ఠానం ఉన్నట్టు సమాచారం. సోనియా, రాహుల్‌, ప్రియాంకలతో డీకేకు సన్నిహిత సంబంధాలు ఉండడంతో ఇక్కడి పార్టీ వ్యవహారాలను ఆయన స్వతంత్రంగా, సమర్థంగా నిర్వహించేందుకు అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+