Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేసీఆర్ కు చెక్, హైదరాబాద్ లో నెల రోజులు డీకే మకాం, తెలంగాణలో లెక్కలు మారుస్తున్న డీకే !

హైదరాబాద్/బెంగళూరు: మరో రెండు నెలల్లో తెలంగాణ (Telangana) అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే వారంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి ఎన్నికల కమీషన్ కసరత్తులు చేస్తోందని జాతీయ మీడియా అంటోంది. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు (KCR) నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌ పార్టీకి కాంగ్రెస్‌ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ప్రభావం చూపాయని అంటున్నారు.

ఈ నేపథ్యంలో రహస్య వ్యూహం రచించేందుకు కేపీసీసీ అధ్యక్షుడు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar) కు తెలంగాణకు (Telangana) సంబంధించి కీలక బాధ్యతలు అప్పగించారు. కర్ణాటక డీసీఎం డీకే శికుమార్ హైదరాబాద్‌లోనే (Hyderabad) మకాం వేయనున్నట్టు సమాచారం. తెలంగాణ ఎన్నికల నిర్వహణ, వ్యూహాత్మక ప్రణాళికలను పర్యవేక్షించేందుకు డీకే శివకుమార్ దాదాపు నెల రోజులు హైదరాబాద్‌లో గడిపే అవకాశం ఉంది.

DK Shivakumar is settling down in Hyderabad to formulate strategies for the Telangana Assembly elections

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియపై డీకే శివకుమార్ (DK Shivakumar) పూర్తి నియంత్రణ కలిగి ఉంటారని, తెలంగాణలో (Telangana) త్వరలో జరగనున్న అసెంబ్లీ (Hyderabad) ఎన్నికల్లో ఆయన విజయానికి బాటలు వేస్తారని కాంగ్రెస్‌ వర్గాల సమాచారం. తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ( Revanth Reddy)ఇటీవల బెంగళూరులో కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌తో (DK Shivakumar) సమావేశమై తెలంగాణలో పార్టీ ప్రచారాన్ని, వ్యూహాన్ని రూపొందించాల్సిందిగా ఆహ్వానించారు.

దీనికి అంగీకరించిన డీకే శివకుమార్ హైదరాబాద్‌లో (Hyderabad) బస చేసేందుకు ఏర్పాట్లు చేయాలని రేవంత్‌ రెడ్డికి ( Revanth Reddy)సూచించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ అంశం కాంగ్రెస్‌కే కాకుండా తెలంగాణలోని ఇతర రాజకీయ పార్టీలకు కూడా కీలకంగా మారింది. కర్ణాటకలో డీకే శివకుమార్ వ్యూహం ఫలించడంతో ఈ పరిణామాలు తెలంగాణ (Telangana) రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.

DK Shivakumar is settling down in Hyderabad to formulate strategies for the Telangana Assembly elections

రేవంత్ రెడ్డిని ( Revanth Reddy) టీపీసీసీ అధ్యక్షుడిగా నియమించడంలో శివకుమార్ కీలక పాత్ర పోషించారు. వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కూడా డీకే శివకుమార్‌తో (DK Shivakumar) సమావేశమై చర్చలు జరిపారు.వైఎస్ షర్మిల ఆమె పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు ఆసక్తి చూపిన సంగతి తెలిసిందే. విలీనం ఇంకా అధికారికం కాలేదు. వైఎస్‌ఆర్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తే ఆ ఘనత శివకుమార్‌కే దక్కుతుందని అంటున్నారు.

ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ కుటుంబానికి (congress) విధేయుడైన డీకే శివకుమార్ రాజకీయ వ్యూహాలకు ప్రసిద్ధి చెందాడని పేరు ఉంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అపూర్వ విజయం సాధించడంలో డీకే శివకుమార్ కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్, తెలంగాణ (Telangana) కాంగ్రెస్ నేతలు డీకే శివకుమార్ ను తెలంగాణలో (Hyderabad) ఎన్నికల ప్రచారానికి రమ్మంటున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు వరుసగా రెండు పర్యాయాలు సీఎంగా ఆ రాష్ట్రాన్ని పాలించారు. తెలంగాణలో (Telangana) బీఆర్ఎస్ పాలనకు వ్యతిరేకత కనిపిస్తోందని సర్వేలు అంటున్నాయని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు ఉచిత హామీలపై తెలంగాణ (Hyderabad)ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

DK Shivakumar is settling down in Hyderabad to formulate strategies for the Telangana Assembly elections

కర్ణాటక మాదిరిగానే తెలంగాణలోనూ (Telangana) అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయి. బీఆర్ఎస్‌ కు చెందిన కొందరు ముఖ్య నేతలు బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ముఖ్య భూమిక పోషించిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీలపై సానుభూతి వెల్లువ మొదలైందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇది తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావుకు (KCR) తలనొప్పిగా మారింది. తెలంగాణలో (Telangana) బీజేపీ ఆటలు సాగవని కొందరు అంటున్నారు. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనే రాజకీయ విశ్లేషకులు (Hyderabad)అంటున్నారు. మొత్తం మీద కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ తో పాటు కర్ణాటకలో తెలుగు మాట్లాడే మంత్రులు (బెంగళూరు) కూడా తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేస్తారని తెలిసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+