కేసీఆర్‌పై కోపంతో ఆ పనిచేయొద్దు: సీఎం రేవంత్‌కు కేటీఆర్ విజ్ఞప్తి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పడంలో ఆరితేరారంటూ విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సామవేశంలో కేటీఆర్ మాట్లాడారు. అప్పుల లెక్కలు కాదు.. హామీల లెక్కలు చెప్పాలన్నారు. వడ్డీల ముచ్చట కాదు.. వాగ్ధానా ముచ్చట్లు చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విషయాల్లోనూ విఫలమైందని కేటీఆర్ ఆరోపించారు. ఈ ప్రభుత్వంలో ఎనుముల బ్రదర్స్‌కు మాత్రమే లాభం జరిగిందన్నారు. సీఎం అనేవారు రాష్ట్ర ప్రతిష్ఠను పెంచాలి కానీ.. దివాళా దిగా తీసుకెళ్తున్నాడని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ విమర్శించారు. సీఎం రేవంత్ ఇంగ్లీష్ వచ్చిన కొత్త పీఆర్వోలను పెట్టుకున్నాడని అన్నారు. తెలంగాణ ఫాలింగ్ జరుగుతుంటే రేజింగ్ అంటున్నారని మండిపడ్డారు.

Don t change the shape of the statue of Telangana Mother KTR requests CM Revanth

తెలంగాణ తల్లి రూపాన్ని మార్చొద్దని కేటీఆర్ అన్నారు. మూర్తీభవించిన స్త్రీగా తెలంగాణ తల్లిని కేసీఆర్ రూపొందించారని, ఆయన మీద కోపంతో తెలంగాణ తల్లి రూపాన్ని మారిస్తే చరిత్ర క్షమించదన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్నారు. నాడు ఇందిరాగాంధీ ప్రతిష్టించిన భారతమాత రూపాన్ని వాజ్‌పేయీ అధికారంలోకి రాగానే మార్చలేదని కేటీఆర్ గుర్తు చేశారు.

దేశంలో ఎన్నో చోట్ల అధికార మార్పిడి జరిగిందని కేటీఆర్ తెలిపారు. తెలుగుత్లి విగ్రహం రూపం ఇప్పటికే మారలేదని కేటీఆర్ చెప్పారు. కన్నడమాత రూపు మారలేదని చెప్పిన కేటీఆర్.. అలాంటప్పుడు ఈ ముఖ్యమంత్రి.. కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ తల్లి రూపాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఆ ప్రయత్నాన్ని మార్చుకోవాలని విజ్ఞప్తి చేశారు.

నాలుగేళ్ల తర్వాత రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టిన స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. అధికారం ఉందని సాయుధ బలగాల మధ్య మీ నాటకాలు కొంతకాలం సాగుతాయన్నారు. అయితే, ఎల్లకాలం ఇదే పరిస్థితి ఉండదని కేటీఆర్ కాంగ్రెస్ సర్కారును హెచ్చరించారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడాది కాలంలోనే లక్ష కోట్ల అప్పు చేశారని కేటీఆర్ ఆరోపించారు. తాము అభివృద్ది చేస్తే.. కాంగ్రెస్ సర్కారు ప్రచారం చేసుకుంటుందని విమర్శించారు. మేము తెచ్చిన కోకా కోలా కంపెనీకి పోయి రేవంత్ రెడ్డి ఫోజులు కొడుతున్నడు. కాళేశ్వరం నీళ్లు మేము తెచ్చాము, కోకా కోలా కంపెనీ మేమే తెచ్చాము.. నువ్వు రిబ్బన్ కట్టింగ్ కి మాత్రమే పనికొచ్చే పనికి మాలిన ముఖ్యమంత్రివి అంటూ కేటీఆర్ దుయ్యబట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+