Hyderabad అలర్ట్: హైదరాబాద్‌లో ఈ ప్రాంతాల్లో తాగునీరు బంద్
హైదరాబాద్: నగరంలో తాగు నీటి సరఫరాకు సంబంధించి నగరవాసులకు జల మండలి కీలక సూచనలు చేసింది. రేపటి (జనవరి 3) నుంచి హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని వెల్లడించింది. హైదరాబాద్ మహా నగరానికి తాగునీరు సరఫరా చేస్తున్న కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్-1లోని సంతోష్ నగర్ వద్దనున్న 1600 ఎంఎం డయా ఎంఎస్ గ్రావిటీ మెయిన్ పైపులైన్‌కు జంక్షన్ పనులు చేపడుతున్నారు.
ఎస్ఆర్డీపీలో భాగంగా నల్డొండ-ఓవైసీ డౌన్ ర్యాంప్ అలైన్మెంట్‌లో ఉన్న సంతోష్ నగర్ దగ్గర కొత్తగా నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులకు ఇబ్బందులు కలగకుండా ఈ జంక్షన్ పనులు చేయనున్నారు. కాబట్టి జనవరి 3 నుంచి నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని జల మండలి అధికారులు ప్రకటించారు.

ఫ్లైఓవర్ పనులు బుధవారం ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు అంటే గురువారం ఉదయం 6 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. దీంతో ఈ 24 గంటల కింద పేర్కొన్న రిజర్వాయర్ పరిధిలోని ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని పేర్కొన్నారు.
నీటి సరఫరాకు అంతరాయం కలిగే ప్రాంతాలు ఇవే:
ఓ అండ్ ఎం డివిజన్ 1: మిరాలం, కిషన్ బాగ్, అల్జుబైల్ కాలనీ
ఓ అండ్ ఎం డీవిజన్ 2(ఎ): సంతోష్ నగర్, వినయ్ నగర్, సైదాబాద్, చంచల్ గూడ, ఆస్మన్ గఢ్, యాకుత్‌పుర, మాదన్నపేట్, మహబూబ్ మాన్షన్.
ఓ అండ్ ఎం డివిజన్ 2(బీ): రియాసత్ నగర్, అలియాబాద్.
ఓ అండ్ ఎం డివిజన్ 4: బొగ్గుల కుంట, అఫ్జల్ గంజ్
ఓ అండ్ ఎం డివిజన్ 5: నారాయణగూడ, అడిక్ మెట్, శివంరోడ్, నల్లకుంట, చిలుకలగూడ.
ఓ అండ్ ఎం డివిజన్ 10(ఎ): దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతం.
ఓ అండ్ ఎం డివిజన్ 20: బొంగులూరు.
ఓ అండ్ ఎం డివిజన్ 22: మన్నెగూడ ప్రాంతాలు.












Click it and Unblock the Notifications