Hyderabad: జీహెచ్ఎంసీ పరిధిలో ఈ ప్రాంతాలకు తాగునీరు బంద్, ఏ రోజంటే?
హైదరాబాద్: తెలంగాణ రాజధాని నగరానికి తాగునీరు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ మహా నగరానికి తాగునీరు సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై పథకం ఫేజు-2లో గున్ గల్ నుంచి సాహెబ్ నగర్ వరకు ఉన్న 2200 ఎంఎం డయా ఎంఎస్ గ్రావిటీ మెయిన్ పైపు లైనుకు రాగన్నగూడ వద్ద భారీ లీకేజీ ఏర్పడింది. ఈ లీకేజీని అరికట్టడానికి మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి.
ఈ క్రమంలో బుధవారం ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు అంటే.. 12.10.2023, గురువారం ఉదయం 6 గంటల వరకు ఈ పనులు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఈ 24 గంటలు జలమండలి పలు డివిజన్ల పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుంది.

ఈ విషయాన్ని గమనించి ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరారు. మరమ్మతు పనులు పూర్తయిన తర్వాత.. నీటి సరఫరాను పునరుద్ధరించడం జరుగుతుంది. ఈ మేరకు హైదరాబాద్ జలమండలి ఒక ప్రకటన విడుదల చేసింది.
హైదరాబాద్‌లో నీటి సరఫరాకు అంతరాయం కలిగే ప్రాంతాలు:
ఓ అండ్ ఎం డివిజన్-1: ఎన్పీఏ, మిరాలం.
ఓ అండ్ ఎం డివిజన్-2: బాలాపూర్, మైసారం, బార్కాస్.
ఓ అండ్ ఎం డివిజన్-5: మేకలమండి, భోలక్ పూర్.
ఓ అండ్ ఎం డివిజన్-7: తార్నాక, లాలాపేట్, బౌద్ధనగర్, మారేడ్ పల్లి, కంట్రోల్ రూమ్, రైల్వేస్, ఎంఈఎస్, కంటోన్మెంట్, ప్రకాశ్ నగర్, పాటిగడ్డ.
ఓ అండ్ ఎం డివిజన్-9: హస్మత్ పేట్, ఫిరోజ్ గూడ, గౌతమ్ నగర్.
ఓ అండ్ ఎం డివిజన్-10 (ఏ), (బి): వైశాలి నగర్, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, ఆటో నగర్, అల్కపురి కాలనీ.
ఓ అండ్ ఎం డివిజన్-13: మహీంద్ర హిల్స్.
ఓ అండ్ ఎం డివిజన్-14: ఏలుగుట్ట, రామంతాపూర్, ఉప్పల్, నాచారం, హబ్సిగూడ, చిల్కానగర్, బీరప్పగడ్డ.
ఓ అండ్ ఎం డివిజన్-16: బుద్వేల్, శాస్త్రిపురం.
ఓ అండ్ ఎం డివిజన్-19: బోడుప్పల్.
ఓ అండ్ ఎం డివిజన్-20: మీర్ పేట్, బడంగ్ పేట్, శంషాబాద్, మన్నెగూడ.
కాగా, నీటి సరఫరాలో అంతరాయం కలిగే ప్రాంతాల వినియోగదారులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని, నీటిని ముందుగానే నిల్వ ఉంచుకోవాలని హైదరాబాద్ జలమండలి అధికారులు సూచించారు.












Click it and Unblock the Notifications