డ్రైవింగ్ లైసెన్స్‌కు మొబైల్ నంబర్ లింక్ చేసుకోకుంటే లైసెన్స్ రద్దు అవుతుందా?
మీ డ్రైవింగ్ లైసెన్స్ కు మొబైల్ నెంబర్ లింక్ అయ్యి లేదా? మొబైల్ నెంబర్ లింక్ అయ్యి లేకుంటే మీ లైసెన్స్ రద్దు అవుతుందని ఆందోళన పడుతున్నారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం మిమ్మల్ని పదేపదే టెన్షన్ పెడుతుందా? అయితే ఈ వార్త మీ కోసమే..
ఇటీవల సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. డ్రైవింగ్ లైసెన్స్‌కు మొబైల్ నంబర్ లింక్ చేయకపోతే ఈ నెలాఖరులోపు లైసెన్స్ రద్దవుతుందని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది. దీనితో చాలా మంది ఆర్టీవో కార్యాలయాలకు పరుగులు పెడుతున్నారు. కానీ రవాణా శాఖ అధికారులు దీనిపైన స్పష్టత ఇస్తున్నారు.

ఇది పూర్తిగా అపోహ అని తేల్చి చెప్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ కు మొబైల్ నంబర్ లింక్ చేయకపోతే లైసెన్స్ రద్దు కాదు. లైసెన్స్ గడువు ముగిసిన తర్వాత కూడా నెల రోజుల వరకు పునరుద్ధరణ అవకాశం ఉంటుంది. కేవలం ఫోన్ నంబర్ లింక్ లేకపోయినంత మాత్రాన లైసెన్స్ రద్దు చేసే అవకాశం లేదు. ఆన్‌లైన్‌లో లింక్ చేయాలని ప్రయత్నించినప్పుడు "లైసెన్స్ వివరాలు లేవు" అని వచ్చినా గాబరా పడాల్సిన అవసరం లేదు.
రాష్ట్ర ప్రభుత్వ సైట్‌లోని వివరాలు వాహన్ సారథి పోర్టల్‌లో పూర్తిగా అప్‌డేట్ కాకపోవడం వల్లే అలా కనిపిస్తుంది. అయితే మీరు ఇంట్లోనే సులభంగా డ్రైవింగ్ లైసెన్స్ కు లింక్ చేసుకోవచ్చు. మీ డ్రైవింగ్ లైసెన్స్ లో మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలంటే https://sarathi.parivahan.gov.in సైట్‌కు వెళ్లండి.మొబైల్ నంబర్ అప్‌డేట్ ఆప్షన్ ఎంచుకోండి. ఆధార్ నంబర్ ఇచ్చి ఓటీపీ వచ్చిన తర్వాత డీఎల్ నంబర్, మొబైల్ నంబర్ నమోదు చేసి ప్రొసీడ్ చేయండి.
తొలిసారి నమోదు చేసుకునేవారు కూడా ఇదే విధానం పాటించవచ్చు. లింక్ చేయడం మంచిది అయినా అవసరమైతే మాత్రమే. అత్యవసరమైతే రవాణా కార్యాలయంలో సంప్రదిస్తే అక్కడి సిబ్బంది కూడా సహాయం చేస్తారు. కాబట్టి ఆందోళన చెందకండి. అవసరమైతే లింక్ చేసుకోండి, లేకపోతే మీ లైసెన్స్ కు వచ్చే ప్రమాదం ఏమీ లేదు.













Click it and Unblock the Notifications
