మందుబాబులకు బిగ్ అలెర్ట్.. ఆ రోజు వైన్స్ బంద్..

తెలంగాణలోని ముఖ్యమైన పండగలో దసరా ఒకటి. దసరా నవరాత్రులు, బతుకమ్మ సంబరాలు నేపథ్యంలో దాదాపు 9 రోజుల పాటు పండగను ఘనంగా జరుపుకుంటారు. ఇక తెలంగాణలో సుక్కా, ముక్క లేనిదే పండగ ఉండదు. అయితే తెలంగాణలో పెద్ద పండగ దసరా ఈసారి అక్టోబర్ 2 న వచ్చింది. ఆ రోజు గాంధీ జయంతి ఉండటంతో నాన్ వెజ్, ఆల్కహాల్ అమ్మకాలు నిషేధం కావడంతో వైన్స్ నిర్వాహకులు అక్టోబర్ 2 న వైన్స్ బంద్ అని ఇప్పుడే ఫ్లెక్సీలు పెట్టారు.

సాధారణంగా ఇలా పండుగలకు బంద్ ఉంటే 1-2 రోజుల ముందు స్టాక్ చేసుకోవాలని ఇప్పట్నుంచే ఫ్లెక్సీలు ప్రదర్శన చేస్తూ హింట్ ఇస్తున్నారు. మా కస్టమర్లకు, వినియోగదారులకు గమనిక. దసరా పండుగ, గాంధీ జయంతి సందర్భంగా తేదీ 02-10-2025 గురువారం రోజున వైన్ షాపు బంద్ అని పలు వైన్స్ షాపుల ముందు ప్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. అసలే దసరా పండగ అదే రోజు వైన్స్ బంద్ కావడంతో మద్యం ప్రియులు వైన్ షాపుల వద్దకు పరుగెత్తుకెళ్తున్నారు. ముందే స్టాక్ తీసుకెళ్తున్నారు.

Dry Dasara Double Whammy Wine Shops Shut on Oct 2 as Gandhi Jayanti Meets Dussehra in Telangana

మరోవైపు తెలంగాణలో కొత్త మద్యం దుకాణాలకు ఇటీవల నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ప్రకారం అక్టోబర్ 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో రూ.2 లక్షల వరకు ఉన్న టెండర్ ఫీజు ఈ సారి రూ. లక్ష పెంచుతూ రూ.3 లక్షలకు మార్చారు. అయితే లైసెన్స్ ఫీజును 6 విడతలుగా చెల్లించేందుకు వెసులుబాటు ఇచ్చారు. ఇక మొత్తం 2,670 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటిలో గౌడ్స్‌ కు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+