Ration Cards: కొత్త రేషన్ కార్డులకు బ్రేక్.. వార్తలపై ఈసీ క్లారిటీ!

Ration Cards: గత పదేళ్లుగా కొత్త రేషన్ కార్డుల కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దరఖాస్తులు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఇదిలా ఉంటే.. తాజాగా తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు ఎన్నికల సంఘం బ్రేక్ వేసిందని వస్తున్న వార్తలపై ఈసీ క్లారిటీ ఇచ్చింది. అలాంటిది ఏమీ లేదని.. ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని ఈసీ స్పష్టం చేసింది. ఎమ్మెల్యే ఎన్నికల కోడ్ దృష్ట్యా వాటిని తక్షణమే నిలిపివేయాలని ఎన్నికల సంఘం ఆదేశించిందని వస్తున్న వార్తలు అవాస్తమని.. మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని వివరణ ఇచ్చింది.

ఎంతో కాలంగా కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. దీంతో ప్రభుత్వం శుక్రవారం నాటి మెమోలో రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఆహార భద్రత లేదా రేషన్ కార్డు దరఖాస్తులను స్వీకరించే సేవలను ప్రారంభించాలని అన్ని మీసేవా కేంద్రాలను తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. గత నెల 26న గ్రామసభల్లో దరఖాస్తు చేయని వారు కూడా మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని పౌరసరఫరాల శాఖ ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్టుల్లో మార్పులు చేర్పులు వంటి వాటికి వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో మీ సేవా కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు కోసం చాలా మంది లబ్ధిదారులు వెళ్లగా.. వారికి నిరాశే మిగిలింది. ప్రజలు మీ సేవా సెంటర్ కు వెళ్లే సర్వీస్ అందుబాటులో లేదని చూపించడంతో కాస్త ఆందోళనకు గురయ్యారు. ఎందుకని మీ సేవా నిర్వాహకులకు కూడా తెలియడం లేదు.

Election Commission Halts New Ration Card Applications in Telangana

ఇదిలా ఉండగా ప్రస్తుతం తెలంగాణలో 281.70 లక్షల యూనిట్లను కవర్ చేసే 89.96 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిలో 35.51 లక్షలు రాష్ట్రం జారీ చేసిన కార్డులు కాగా.. మిగిలినవి 54.45 లక్షలు జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) కార్డులు. ఆహార భద్రతా కార్డులకు అర్హత ఆదాయం, భూమి యాజమాన్యం, మరికొన్ని అంశాలపై ఆధారపడి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+