సినిమాల్లో అవకాశం కోసం: వ్యభిచార గృహంలో దొరికిన ఇంజినీరింగ్ యువతి

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: సినిమాల్లో వెలిగిపోవాలన్న ఓ యువతి కోరికకు ఆర్థిక ఇబ్బందులు అడ్డు వచ్చాయి. వాటి నుంచి బయటపడి తన కలలను నిజం చేసుకునేందుకు ఆ యువతి తప్పుడు మార్గాన్ని ఎంచుకుంది. చివరకు పోలీసులకు చిక్కింది.

ఇంజినీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతున్న ఓ యువతి వ్యభిచార గృహంలో పోలీసులకు పట్టుబడింది. ఈ సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. యూసఫ్ గూడ సమీపంలో విక్కీ అనే వ్యక్తి కొంతకాలంగా వ్యభిచార గృహం నిర్వహిస్తున్నాడు.

అందమైన అమ్మాయిలను ఎంచుకొని

అందమైన అమ్మాయిలను ఎంచుకొని

ఇద్దరు ఆయనకు అసిస్టెంట్లుగా పని చేస్తున్నారు. అందంగా ఉన్న అమ్మాయిలను ఎంచుకొని వారి బలహీనతలను ఆసరాగా చేసుకొని అడిగినంత డబ్బు ఇచ్చి వ్యభిచార కూపంలోకి లాగుతున్నారు.

సినిమాల్లో నటించాలని ఉందని చెప్పడంతో

సినిమాల్లో నటించాలని ఉందని చెప్పడంతో

ఈ నేపథ్యంలో బిటెక్ చివరి సంవత్సరం చదువుతున్న ఓ అమ్మాయి తనకు సినిమాల్లో నటించాలని ఉందని చెప్పింది. దుస్తులు, మేకప్, ఖర్చుల కోసం డబ్బులు లేవని వారికి చెప్పింది. ఆమెను వారు తమ ట్రాప్‌లో పడేశారు.

సినిమా షూటింగ్ కోసమని ఫోటోలు తీయించారు

సినిమా షూటింగ్ కోసమని ఫోటోలు తీయించారు

సినిమా షూటింగ్ కోసమంటూ అందమైన ఫోటోలు తీయించారు. విషయం ముందుగానే చెప్పి ఆ ఫోటోలను కొందరు యువకులకు పోస్ట్ చేశారు. ఆమెను వ్యభిచార గృహానికి రప్పించారు. ఆ సమయంలో పోలీసులు వ్యభిచార గృహంపై దాడి చేయగా, ఆమె చిక్కింది.

వివరాలు ఆరా తీయగా..

వివరాలు ఆరా తీయగా..

ఆమె వివరాలు ఆరా తీయగా.. ఇంజినీరింగ్ చదువుతున్నట్లు తేలింది. ఆ అమ్మాయితో పాటు ముంబైకి చెందిన మరో మోడల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరిని బాలికల పునరావాస కేంద్రానికి తరలించారు. నిర్వాహకుడు విక్కీ పరారీలో ఉన్నారు. ఆయన సహాయకులను అరెస్టు చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Engineering final year student caught in brothel house in Hyderabad.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి