బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఎడ్లబండ్ల ర్యాలీలో ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు!
రైతును రాజును చేసింది కేసీఆర్ అయితే రైతు వెన్నెముక విరిచింది కాంగ్రెస్ ప్రభుత్వమని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బోగస్ మాటలు చెప్పి ప్రజలను బోల్తా కొట్టించిన కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం దేవన్నపేట 65వ డివిజన్ లో బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహాల్లో భాగంగా నిర్వహించిన ఎడ్లబండి ర్యాలీకి మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు.
వాళ్ళను ఓడించాలి
ఈ నెల 27న జరగనున్న బిఆర్ఎస్ రజతోత్సవ సభకు ఎడ్లబండ్ల ర్యాలీ చేపట్టిన గ్రామాల్లో ప్రచారం చేసిన ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ మోసపూరిత కాంగ్రెస్ మాటలు వినే తాము మోసపోయామని ప్రజలు అంటున్నారన్నారు. కేసిఆర్ ఒక విజన్ తో పని చేస్తే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవగాహన లోపంతో ఉందన్నారు. బోగస్ మాటలు చెప్పి ప్రజలను బోల్తా కొట్టించిన ఈ కాంగ్రెస్ పార్టీని భవిష్యత్ ఎన్నికల్లో ఓడించాలన్నారు.

ఈసారి ఎన్నికలొస్తే బీఆర్ఎస్ 100 స్థానాల్లో గెలుస్తుంది
భూముల రేట్లు పెంచి మనలను అభివృద్ధి చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే, ఆ భూముల రేట్లు మొత్తం పడిపోయేలా చేసి నాశనం చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. రానున్న స్థానిక ఎలక్షన్లో మన సత్తా చాటాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నెల 27 న జరగనున్న బిఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రజలు పెద్దఎత్తున హాజరు కావాలని కోరారు.ఈసారి ఎన్నికలొస్తే బీఆర్ఎస్ 100 స్థానాల్లో గెలుస్తుందన్నారు.
గొప్ప విజన్ ఉన్న నాయకులు ఇద్దరే ఇద్దరు
ఈ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని హామీలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందన్నారు. ఒక గొప్ప విజన్ ఉన్న నాయకుడు కెసిఆర్ అని కొనియాడారు.నాకు తెలిసి ఇద్దరే గొప్ప విజన్ ఉన్న నాయకులు నాడు ఎన్టీఆర్, ఇప్పుడు కేసీఆర్ అన్నారు. నాడు ఎన్టీఆర్ ప్రజల సంక్షేమం కోసం పథకాలు పెట్టారన్నారు.
ఎన్టీఆర్, కేసీఆర్ ప్రజా సంక్షేమానికి పని చేశారు
వాటి కొనగింపుగా రైతులకోసం సాగునీరు కరెంట్ కోతలు లేకుండా రైతుల సంక్షేమం కోసం రైతు బంధు, రైతు భీమా పెట్టిన గొప్ప నాయకులు కెసిఆర్ అన్నారు. ఫింఛన్లు పెట్టింది ఎన్టీఆర్ అయితే, దాన్ని పెంచి ఆసరా అందించిన ఘనత కెసిఆర్ ది అన్నారు. పింఛన్లు ఎగ్గొట్టేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని మండిపడ్డారు.
తండాలను గ్రామపంచాయతీలు చేసిన మహోన్నతమైన వ్యక్తి మన కేసీఆర్ అని కొనియాడారు.
రైతు బంధు ఎగ్గొట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం
కెసిఆర్ ముందు చూపుతో తండాలను గ్రామపంచాయతీలు చేస్తే ఈ ప్రభుత్వం కనీసం ఆ గ్రామపంచాయతీ బిల్లులు చెల్లించడానికి కూడా ముందుకు రావడం లేదన్నారు. రైతుబంధు ఎగ్గొట్టిన ఈ మోసపూరిత ప్రభుత్వాన్ని నీలదీయండి అని ఎర్రబెల్లి పిలుపునిచ్చారు. ప్రజలు ఏదో ఈ మోసపూరిత హామీలకు మోసపోయి కాంగ్రెస్ కు ఓటేసారని వారికి అర్థమైందన్నారు.
మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వ పాలన నుంచి రక్షించాల్సిన అవసరం ఉంది
వారిని కూడా చైతన్యవంతం చేసి రైతులకు జరుగుతున్న నష్టానికి మనం అండగా నిలిచి ప్రతి ఒక్కరిని ఈ మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వ పాలన నుంచి రక్షించాల్సిన అవసరం ఉందన్నారు. రానున్నది మన ప్రభుత్వమే అని, కెసిఆర్ ని ముఖ్యమంత్రి చేసే దిశగా మనందరం కష్టపడాల్సిన బాధ్యత ఉందన్నారు. పార్టీలో కష్టపడే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు.ఈ రజతోత్సవ మహాసభను విజయవంతం చేయాల్సిందిగా కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు ఎర్రబెల్లి దయాకర్ రావు.
-
జగన్ సీపీఆర్వో శ్రీహరి అరెస్ట్ కలకలం-హైకోర్టుకు వైసీపీ-డీజీపీకి ఘాటు లేఖ..! -
డీ లిమిటేషన్ వేళ రూటు మార్చిన జగన్ - ఢిల్లీ కేంద్రంగా కీలక పరిణామాలు...!! -
Sana Satish Babu: లోకేష్ సన్నిహితుడికి టీడీపీలో కీలక పదవి..! బిగ్ ప్రమోషన్..! -
బీహార్ సీఎంగా లాలూకు నమ్మినబంటు: నాడు రబ్రీదేవి కేబినెట్ లో మంత్రి -
Pawan Khera: కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు సుప్రీం షాక్-తెలంగాణ హైకోర్టు బెయిల్ పై..! -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications