Etela Rajender : ఈటల బృందానికి తప్పిన పెను ప్రమాదం... పైలట్ అప్రమత్తమవడంతో అంతా సేఫ్...
మాజీ మంత్రి ఈటల రాజేందర్ బృందానికి ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి ఈటల బృందం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయలుదేరగా... టేకాఫ్ సమయంలో రన్ వేపై సాంకేతిక సమస్య తలెత్తింది. పైలట్ వెంటనే అప్రమత్తమై ఢిల్లీ విమానాశ్రయంలోనే ఆ స్పైస్ జెట్ విమానాన్ని నిలిపివేశాడు. విమానంలో ఈటలతో పాటు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు,సీనియర్ నేత వివేక్ వెంకటస్వామి,మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి,మాజీ జడ్పీ ఛైర్ పర్సన్ తుల ఉమ సహా మొత్తం 184 మంది ఉన్నారు. పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
నిపుణుల బృందం సాంకేతిక సమస్యను పరిష్కరించడంతో ఈటల బృందం తిరిగి హైదరాబాద్ బయలుదేరింది. ఉదయం 11.30గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి ఈటల బృందం చేరుకోనుంది.ఈటల ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తిందని తెలియడంతో ఆయన మద్దతుదారులు,అభిమానులు ఆందోళన చెందారు. ప్రమాదమేమీ లేదని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు.

నిజానికి శంషాబాద్ విమానాశ్రయంలో ఈటలకు ఘనస్వాగతం ఏర్పాటు చేసి... అక్కడి నుంచి హైదరాబాద్‌లోని రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి భారీ ర్యాలీ ఏర్పాటు చేయాలని పార్టీ నేతలు భావించారు. అయితే కోవిడ్ నేపథ్యంలో ఆ ఆలోచన విరమించుకున్నారు. బీజేపీ కార్యాలయంలో ఎక్కువమందితో సమావేశాలు నిర్వహించకూడదని పార్టీ కేంద్ర కార్యాలయం గతంలో జారీ చేసింది. దీంతో ఈటల నేరుగా శంషాబాద్ నుంచి శామీర్ పేటలోని తన నివాసానికి వెళ్లనున్నారు. ఈటలతో పాటు ఆయన వెంట వెళ్లిన నేతలు కూడా శామీర్ పేట నివాసానికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
ఈటల బీజేపీలో చేరిక పూర్తవడంతో ఇక హుజురాబాద్ ఉపఎన్నిక పైనే ఆయన పూర్తి ఫోకస్ పెట్టనున్నారు. బీజేపీ నేతలతో కలిసి ఉపఎన్నికకు సంబంధించిన వ్యూహాలు రచించనున్నారు. కొద్దిరోజుల్లోనే ఈటల సహా బీజేపీ టీమ్ హుజురాబాద్‌లో మకాం వేసే అవకాశం ఉంది. ఉపఎన్నికలో టీఆర్ఎస్‌ను ఓడిస్తే రాజకీయంగా ఈటల స్టేటస్ మరింత పెరుగుతుంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం బీజేపీలోనూ ఆయన పట్ల చిన్నచూపు ఏర్పడే అవకాశం లేకపోలేదు. కాబట్టి శక్తియుక్తులన్నీ కూడదీసుకుని హుజురాబాద్‌లో ఎలాగైనా గెలిచి తీరాలని ఈటల భావిస్తున్నారు. మరోవైపు హుజురాబాద్‌లో గెలుపు తమదేనని... ఈటల ఏం చేసినా అక్కడ ఓటమి తప్పదని టీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హుజురాబాద్ ఉపఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో హైటెన్షన్ క్రియేట్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications