అరుదైన గౌరవం: ఐక్యరాజ్య సమితి కౌన్సిల్ సమావేశానికి మాలావత్ పూర్ణ
హైదరాబాద్: అతిచిన్న వయస్సులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మాలావత్ పూర్ణ.. మరో అరుదైన అవకాశన్ని సొంతం చేసుకుంది. అమెరికాలోని న్యూయార్క్ లో సెప్టెంబర్ 25, 26 తేదీల్లో జరగనున్న జనరల్ అసెంబ్లీలో మాట్లాడే అవకాశం పూర్ణకు దక్కింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఈ అవకాశం లభించింది కేవలం ఇద్దరికి మాత్రమే. అందులో మాలావత్ పూర్ణ ఒకరు. కాగా, యూఎన్ఓ జనరల్ అసెంబ్లీలో 'భారతదేశంలో పేదరికం' అనే అంశంపై ఆమె మాట్లాడనుంది. ఈ సందర్భంగా పూర్ణ శనివారం అమెరికాకు బయలుదేరి వెళ్లారు.
ఈ అవకాశం తనకు లభించడంపై పూర్ణ ఏమంటున్నారంటే...'తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతోనే నాడు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించా. నా ప్రతిభను గుర్తించి యూఎన్ఓ ఈ అవకాశం ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది' అని పూర్ణ అన్నారు.

కాగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న గ్రామజ్యోతి పథకంలో భాగంగా మాలావత్ పూర్ణ గ్రామమైన పాకాలను కలెక్టర్ యోగితా రాణా దత్తత తీసుకున్నారు. జిల్లా మరుగుదొడ్ల అంబాసిడర్‌గా మాలావత్ పూర్ణను నియమించడం ఇలా ప్రతిభను వెతుక్కుంటూ అవకాశాలు రావడం తో గ్రామస్తులు, మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మండలానికి 20కిలో మీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామంపై నేడు జిల్లా, రాష్ట్రస్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారంటే పూర్ణ కారణం అని చెప్పవచ్చు.
ఇది ఇలా ఉండగా, తెలంగాణ జాతి ప్రతిష్టను దేశ, అంతర్జాతీయ స్థాయిలో చాటి చెప్పిన గిరిజన బిడ్డను అభినందిస్తూ ప్రభుత్వం ఐదు ఎకరాల భూమితో పాటు రూ.25 లక్షల నగదు సీఎం కేసీఆర్ అందజేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు స్వయంగా పిలిచి పూర్ణను అభినందించారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications