TGSRTC బస్సులో ఛార్జీలు భారీగా తగ్గింపు: రూట్ ఇదే
TGSRTC: పండగ సీజన్ లల్లో కొన్ని ఎంపిక చేసిన రద్దీ మార్గాల్లో ప్రయాణ ఛార్జీల్లో రాయితీలను ప్రకటించే ఆనవాయితీని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కొనసాగిస్తోంది. ఈ పండగ సీజన్ లో కూడా కొన్ని సెలెక్టివ్ రూట్ లల్లో దీన్ని అమలులోకి తీసుకొచ్చింది కూడా. రద్దీ మార్గాలైన హైదరాబాద్- విజయవాడ, హైదరాబాద్- బెంగళూరు, హైదరాబాద్- తిరుపతి వంటి రూట్లల్లో గతంలో ఇటువంటి రాయితీలను ప్రవేశపెట్టింది టీజీఎస్ఆర్టీసీ.
అవి సక్సెస్ అయ్యాయి. ఆయా బస్సులు, ఆయా మార్గాల్లో ఆక్యుపెన్సీ రేషియలో భారీగా పెరుగుదల చోటు చేసుకుంటూ వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని తాజాగా మరో రూట్ లో ప్రయాణ ఛార్జీలో డిస్కౌంట్ ను అమలు చేస్తోంది. హైదరాబాద్- విజయవాడ రూట్ లో ఇ-గరుడ బస్సుల్లో దీన్ని వర్తింపజేసింది. ఈ మార్గంలో ఈ-గరుడ బస్సుల్లో ప్రయాణ ఛార్జీలో ఏకంగా 26 శాతం డిస్కౌంట్ అమలులోకి వచ్చింది.

రద్దీ సీజన్ లల్లో ఏపీఎస్ఆర్టీసీతో పోటీ పడుతూ ఆక్యుపెన్సీ రేషియోను భారీగా పెంచుకుంటూ వస్తోంది టీజీఎస్ఆర్టీసీ. ప్రయాణికులను ఆకట్టుకునే క్రమంలో పలు కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. బంపర్ ఆఫర్లను ప్రకటిస్తోంది. పండగ సీజన్ లల్లో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన వారికి నగదు బహుమతులను అందజేయడం వంటి పథకాలతో ఆక్యుపెన్సీ రేషియో భారీగా పెంచుకుంటోంది. అదే సమయంలో తాజా ఆఫర్‌ను తెర మీదికి తీసుకొచ్చింది.
హైదరాబాద్- విజయవాడ మార్గంలో ప్రయాణ ఛార్జీలో 26 శాతం డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఈ మార్గంలో పలు బస్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. సూపర్ లగ్జరీ, రాజధాని, లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్, లహరి నాన్ ఏసీ సీటర్ కమ్ స్లీపర్, లహరి ఏసీ స్లీపర్ బస్సులు హైదరాబాద్- విజయవాడ మధ్య రాకపోకలు సాగిస్తోన్నాయి. పర్యావరణ హిత ఎలక్ట్రానిక్ బస్సులను ప్రయాణికులకు మరింత చేరువ చేసే క్రమంలో ఈ- గరుడ బస్సులో తాజా డిస్కౌంట్ అందుబాటులోకి వచ్చింది.












Click it and Unblock the Notifications