అక్రమ సంబంధం: భర్తను ఆరో అంతస్థు నుంచి తోసేసింది, మృతి
హైదరాబాద్: వివాహేతర సంబంధం హైదరాబాదులో ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. శ్రీకాకుళం జిల్లా యలమంచిలి గ్రామానికి చెందిన గోన సీతారామ్(27) భార్య సుజాతతో కలిసి బతుకుదెరువు కోసం నగరానికి వచ్చాడు.
మసీదు బండలో నివసిస్తూ ఓ నిర్మాణ సంస్థలో పనిచేస్తున్నారు. సీతారామ్ తాను పనిచేస్తున్నచోట మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతోంది. గురువారం సాయంత్రం పనిచేస్తున్నచోట భార్యాభర్తలిద్దరూ గొడవపడ్డారు.

ఈ గొడవలో పట్టరాని ఆగ్రహంతో సుజాత ఆరో అంతస్థు నుంచి భర్తను కిందకు తోసేసింది. సహచర కూలీలు అతడిని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు.
సమాచారం అందుకున్న గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్ రమేష్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications