పిల్లల భవిష్యత్తు కోసం ఉదయం హోంగార్డ్, రాత్రి డ్రైవర్
హైదరాబాదుకు చెందిన జావెద్ ఖాన్ అనే హోంగార్డు తన పిల్లల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చి దిద్దడం కోసం పలు పనులు చేస్తున్నాడు. ఆయన వృత్తిపరంగా ట్రాఫిక్ హోంగార్డ్.
హైదరాబాద్: హైదరాబాదుకు చెందిన జావెద్ ఖాన్ అనే హోంగార్డు తన పిల్లల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చి దిద్దడం కోసం పలు పనులు చేస్తున్నాడు. ఆయన వృత్తిపరంగా ట్రాఫిక్ హోంగార్డ్.
రోజంతా ఎర్రటి ఎండలో విధులు నిర్వర్తిస్తాడు. ఆ తర్వాత రాత్రి ఆటో నడుపుతాడు. ఇలా ఎందుకు చేస్తున్నావని అడిగితే తన పిల్లల కోసం అంటాడు. తనకు ఆడపిల్లలున్నారని తనకొచ్చే చాలీచాలని జీతంతో వారి చదువును ఆపదలుచుకోలేదని అంటాడు.

అందుకే ఆటో నడుపుతూ సంపాదించుకుంటున్నట్లు చెబుతాడు. రెండు డ్యూటీలతో తనకు వచ్చే డబ్బు పిల్లల ఫీజులు, వారి ఖర్చులకు సరిపోతుందని చెబుతున్నారు.
అతని కథనం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పందించారు. అతని పిల్లలకు స్కాలర్‌షిప్ ఇస్తామని హామీ ఇచ్చారు. వ్యక్తిగతంగా కలుస్తానని చెప్పారు.












Click it and Unblock the Notifications