పెళ్లింట డీజే చిచ్చు.. డ్యాన్సులొద్దని వరుడు, స్టెప్పులేయాల్సిందేనన్న వధువు.. డిష్యూం.. డిష్యూం...
Recommended Video
అవును పెళ్లింట డీజే చిచ్చుపెట్టింది. పచ్చటి తోరణాల మధ్య ఇరుకుటుంబాలు దాడులు చేసుకునే వరకు వెళ్లింది. రెండు స్టెప్పులులేసే విషయం కాస్త.. ముష్టిఘాతానికి దారితీసింది. సూర్యాపేట జిల్లాలో రెండురోజుల క్రితం జరిగిన ఘటన సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇరు కుటంబాల మధ్య గొడవకు డీజేనే కారణం కావడం విశేషం.
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తొగరాయ గ్రామంలో రెండురోజుల క్రితం పెళ్లయ్యింది. వధువు, వరుడును ఇరు కుటుంబాల పెద్దలు ఆశీర్వదించారు. దీవించారు. భోజనాలు ముగిసి.. అప్పగింతల సమయం వచ్చేసరికి సీన్ మారిపోయింది. పెళ్లికూతురు తరఫు బంధువులు డీజే తీసుకొచ్చారు. ఇప్పుడు డీజే ఎందుకు అనడంతో గొడవ జరిగింది. అప్పగింతలు కాదు కదా ముష్టిఘాతానికి దారితీసింది.

డీజే తీసుకొస్తే ఆలస్యవుతుందని పెళ్లికొడుకు తరఫువారు భావించారు. వద్దని చెప్పారు. కానీ పెళ్లి కూతురు తరఫువారు వినిపించుకోలేదు. దీంతో మాటా మాటా పెరిగింది. చేతులు లేసి దాడులకు దారితీసింది. పెళ్లింట కర్రలు లేచి.. తలలు పగిలాయి. కొందరు కల్పించుకొని గొడవ వద్దని చెప్పినా వినిపించుకొని పరిస్థితి నెలకొంది. కర్రలు, కుర్చీలు లేవడంతో అక్కడ ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. నవ్వులు పూసేచోట ఉద్రిక్త సిచుయేషన్ ఏర్పడింది. డ్యాన్స్ సీన్ కాస్త ఫైట్ సీన్‌గా మారింది. పరస్పరం దాడులు చేసుకోవడంతో కొందరికీ గాయాలు కూడా అయ్యాయి. అయితే ఈ వీడియోను కొందరు తీసి.. సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఆ వీడియో తెగ ట్రోల్ అవుతోంది.
-
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు












Click it and Unblock the Notifications