హైదరాబాద్‌లో తొలి కరోనా కేసు నమోదు..ఎక్కడంటే..?
రాష్ట్రంలో మొట్టమొదటి కరోనావైరస్ (COVID-19) కేసు నమోదు కావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ప్రాంతంలో ఒక వైద్యుడికి ఈ వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు సమాచారం. రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదు కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.
తొలి కేసు నమోదు కావడంతో, అధికారులు వెంటనే ఆ వైద్యుడిని ఐసోలేషన్‌కు తరలించారు. అంతేకాకుండా, ఆయనతో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించే ప్రక్రియను ముమ్మరం చేశారు. కూకట్‌పల్లి ప్రాంతంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, అనవసరంగా బయట తిరగవద్దని అధికారులు సూచిస్తున్నారు. ఈ పరిణామం రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలను మరింత పటిష్టం చేయడానికి దారితీసింది. ప్రజలు భయాందోళనలకు గురికాకుండా, ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని వైద్య ఆరోగ్య శాఖ విజ్ఞప్తి చేస్తోంది.

మరోవైపు ఏపీలో కూడా తొలి కేసు నమోదైంది. వైజాగ్‌లో తొలి కేసు నమోదైనట్టు అధికారులు తెలిపారు. నగరంలోని పిఠాపురం కాలనీకి చెందిన 28 ఏళ్ల మహిళకు కోవిడ్ నిర్ధారణ కావడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ అడ్వైజరీని జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కానీ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. చాలా కాలం తర్వాత మళ్ళీ కరోనా మరణాలు సంభవించడం తీవ్ర సంచలనం సృష్టిస్తుంది. ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ (KEM) ఆసుపత్రిలో ఇద్దరు కోవిడ్-19 పాజిటివ్ రోగులు మరణించినట్టు ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి. మృతుల్లో ముంబైకి చెందిన 14 ఏళ్ల బాలిక, 54 ఏళ్ల మహిళ ఉన్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా 260 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ పెరుగుదల ప్రజలను అప్రమత్తం కావాలని హెచ్చరిస్తోంది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications