వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డ్రోన్ల ద్వారా కరోనా మెడిసిన్ పంపిణీ ; దేశంలోనే తొలిసారి తెలంగాణాలో.. వికారాబాద్ లో ట్రయల్ రన్

|
Google Oneindia TeluguNews

డ్రోన్ల సహాయంతో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ట్రయల్ రన్ ను నేడు తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా కేంద్రంలో ప్రారంభించారు. తెలంగాణా రాష్ట్రంలో ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా డ్రోన్ల ద్వారా కరోనా మందులు, టీకాలు సరఫరా చేస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు వికారాబాద్ జిల్లా కేంద్రంగా డ్రోన్స్ తో కరోనా వ్యాక్సిన్, మందుల పంపిణీ ట్రయల్ రన్ నిర్వహించారు.

డ్రోన్ల ద్వారా కరోనా వ్యాక్సిన్లు , మందులు సరఫరా


దేశంలోనే మొదటిసారిగా డ్రోన్ల ద్వారా కరోనా వ్యాక్సిన్లు , మందులు సరఫరా చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం రికార్డు సృష్టించనుంది. కరోనా వ్యాక్సిన్ ల పంపిణీ కోసం బియాండ్ విజువల్ లైన్ ఆఫ్ సైట్ డ్రోన్లను వినియోగిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించనుందని సమాచారం. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కరోనా మందులు, టీకాలను డ్రోన్ల ద్వారా పంపిణీ చేస్తామని చెప్పిన మంత్రి కేటీఆర్ తొలిదశలో ట్రయల్ రన్ క్రింద నేటి నుండి ఈ నెల 17వ తేదీ వరకు వికారాబాద్ జిల్లాలో డ్రోన్ల ద్వారా మందులను సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు.

ఈనెల 11వ తేదీ నుండి తొమ్మిది కి.మీ నుండి 10 కి.మీ దూరంలో ఉన్న లక్ష్యాలకు సేవలు

స్కై ఎయిర్ మొబిలిటీ సాయంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. అంతేకాకుండా ఈనెల 11వ తేదీ నుండి తొమ్మిది కిలోమీటర్ల నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలకు సేవలు అందిస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ విధానం ద్వారా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వెయ్యటానికి అవకాశం ఉందని, ఆశ వర్కర్లకు సైతం ఇబ్బందులు తప్పనున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇదిలా ఉంటే నేడు రేపు వికారాబాద్ జిల్లాలో కరోనా వ్యాక్సిన్ పంపిణీపై ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు.

ఈ రోజు వికారాబాద్ ఎస్పీ కార్యాలయం వద్ద స్కై మెడిసిన్ డ్రోన్ పై ట్రయల్ రన్

ఈనెల 11వ తేదీన ప్రయోగాత్మకంగా డ్రోన్ల సహాయంతో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేసే కార్యక్రమానికి ముందుగా నిర్వహిస్తున్న ట్రయల్ రన్ లో భాగంగా ఈరోజు జిల్లా ఎస్పీ కార్యాలయం నుండి పెరేడ్ గ్రౌండ్లో జిల్లా కలెక్టర్ నిఖిల, ఎస్పీ నారాయణల ఆధ్వర్యంలో టెక్నికల్ బృందం స్కై మెడిసిన్ డ్రోన్ కెమెరాని ట్రయల్ రన్ నిర్వహించి పరీక్షించింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రభుత్వం స్కై మెడిసిన్స్ కార్యక్రమాన్ని నిర్వహించనుందని, అందులో మొట్టమొదటగా వికారాబాద్ జిల్లాలో ప్రారంభం కానుందని పేర్కొన్నారు.

మారుమూల పల్లెలకు, హెల్త్ సెంటర్ లకు వ్యాక్సిన్ ల పంపిణీ

ఈ కార్యక్రమం ద్వారా మారుమూల పల్లెలకు ,హెల్త్ సెంటర్ లకు కూడా అత్యవసర సమయంలో వ్యాక్సినేషన్, మందులు అందించడం సులభతరం కానుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈరోజు ప్రయోగం చేసిన డ్రోన్ కు 140 మీటర్ల ఎత్తు వరకు ఎగిరేందుకు అనుమతులు ఉన్నాయని, ఈ ప్రయోగం సక్సెస్ అయిందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా డ్రోన్ల సహాయంతో కరోనా వ్యాక్సిన్ సరఫరాను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

Recommended Video

Jammu : ఆయుధాలుగా Drones, రోబోటిక్.. భారత్ ఎలా ఎదుర్కొంటుంది? Anti Drone System || Oneindia Telugu

ఎత్తైన కొండ రాష్ట్రాల్లోనూ డ్రోన్ల తో పంపిణీకి రెడీ అయిన కేంద్రం

దేశంలోని ఈశాన్య రాష్ట్రాలలో ఎత్తైన కొండ ప్రాంతాలలో డ్రోన్ ద్వారా వ్యాక్సిన్లను, మెడిసిన్ ను సరఫరా చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి కావలసిన ఏర్పాట్లను చేసింది. దేశంలో మానవరహిత ఏరియల్ వెహికల్ ద్వారా మెడికల్ కిట్స్ కరోనా వ్యాక్సిన్ సరఫరా కోసం టెండర్లను కూడా కేంద్రం ఆహ్వానించింది .దేశంలో ఎంపిక చేసిన ప్రాంతాలలోనే డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్లను, మందులను సరఫరా చేయనున్నట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.

English summary
The trial run of corona vaccine distribution with the help of drones started today at Vikarabad district center in Telangana state. It is learned that the government had earlier announced that it would supply corona drugs and vaccines through drones to make them available to the public in Telangana. In this context, the Corona Vaccine and Drug Distribution Trial Run was conducted with drones at Vikarabad district headquarters today. Telangana will set a record as the first state in the country to supply corona vaccines and drugs by drones.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X