హీరో సందీప్ కిషన్ హోటల్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు: శుభ్రత, నాణ్యత?

హైదరాబాద్: గత కొద్ది రోజులుగా హైదరాబాద్ నగరంలోని పలు హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రమాణాలను పాటించని హోటళ్లపై చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో బుధవారం సికింద్రాబాద్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రత అధికారులు తనిఖీలు చేపట్టారు.

టాలీవుడ్ హీరో సందీప్ కిషన్‌కు చెందిన వివాహ భోజనంబు హోటల్ తోపాటు గ్రిల్ 9 హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కాలం చెల్లిన బియ్యంతో పాటు నాణ్యత లేని ఆహార పదార్థాలు తయారీ చేస్తున్నట్లు గుర్తించారు. ఫ్రిజ్‌లో నిల్వ చేసిన వస్తువులను వేడి చేసి వినియోగదారులకు అందిస్తుండడంపై ఆరా తీశారు. వంటగదిలో పరిశుభ్రత లోపించినట్లు గుర్తించిన అధికారులు పరిశుభ్రత పాటించాలని హెచ్చరించారు.
ఆ హోటళ్లపై కేసు నమోదు చేశారు.

Food safety officials Inspection on Hero Sundeep Kishan Hotel

2022 నాటికి గడువు ముగిసిన 25 కిలోల చిట్టి ముత్యాలు బియ్యాన్ని పట్టుకున్నారు. నాణత్యలేని ఈ బియ్యంతోనే ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. అలాగే 500 గ్రాముల కొబ్బరి తురము కొబ్బెరలో సింథటిక్ ఫుడ్ కలర్స్ కలిపినట్లుగా అధికారులు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వంట శాలలో శుభ్రత లేదని, చెత్తబుట్టలకు ఎక్కడా కూడా మూతలు లేవని గుర్తించారు.

ఫుడ్ హ్యాండిల్ చేసేవారి ఆరోగ్య పరిస్థితికి సంబంధించి వైద్య ధృవీకరణ పత్రాలు లేవని అధికారులు తెలిపారు. అలాగే కిచెన్‌లో డ్రైన్ నీరు నిల్వ ఉండిపోయిందని, వంటల కోసం వాటర్ బబుల్ వాడుతున్నట్లు గుర్తించారు. ఆహార పదార్థాల తయారీకి, కస్టమర్లకు అందించే నీటికి సంబంధించిన సరైన సర్టిఫికెట్లు లేవని తనీఖీల్లో గుర్తించారు. ఈ మేరకు తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో ప్రమాణాలు పాటించని హోటళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+