ఆస్తి కోసం .. తల్లికే తలకొరివి పెట్టనన్న కొడుకు , మరో ఘటనలో తండ్రిని కిడ్నాప్ చేసిన తనయులు

ఆస్తి కోసం ఓ కొడుకు మానవత్వాన్ని మరిచి పోయాడు. నవమాసాలు మోసి, కని పెంచి పెద్ద చేసిన తల్లికే తలకొరివి పెట్టడానికి నిరాకరించాడు.తనకు ఆస్తి ఇస్తే తప్ప తలకొరివి పెట్టనని స్మశానంలో అడ్డం తిరిగాడు. ఇక మరో ఘటనలో కొడుకులు తల్లిదండ్రుల ఫొటోకు చెప్పుల దండ వేసి అవమానించారు . ఆస్తి కోసం ఏకంగా కన్న తండ్రినే కిడ్నాప్ చేశారు . వరంగల్ అర్బన్ , సూర్యాపేట జిల్లాలలో చోటు చేసుకున్న ఈ ఘటనలు స్థానికులను షాక్ కు గురిచేశాయి.

వరంగల్ అర్బన్ జిల్లాలో దారుణం .. ఆస్తి కోసం తల్లికే తలకొరివి పెట్టనన్న కొడుకు

వరంగల్ అర్బన్ జిల్లాలో దారుణం .. ఆస్తి కోసం తల్లికే తలకొరివి పెట్టనన్న కొడుకు

వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం జీలుగుల గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మానవత్వం మరచిపోయిన ఓ తనయుడు తల్లి పేరు మీద ఉన్న ఆస్తి తనకు ఇవ్వాలని, అలా ఇస్తేనే తల్లి మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహిస్తానని అడ్డు తిరగడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. రాజమ్మ అనే వృద్ధురాలు మృతి చెందగా ఆమె చిన్న కొడుకు రవీందర్ తల్లి పేరుతో ఉన్న ఎకరం 27 గుంటల భూమిని తనకు ఇస్తేనే తలకొరివి పెడతానని దహన సంస్కారాల కోసం తీరా వ్యవసాయ భూమిలోకి వెళ్ళాక అడ్డం తిరిగాడు.

 అంత్యక్రియలు చేయడానికి అంతా రెడీ అయ్యాక తలకొరివి పెట్టకుండా రగడ

అంత్యక్రియలు చేయడానికి అంతా రెడీ అయ్యాక తలకొరివి పెట్టకుండా రగడ

అంతేకాదు తనకు వర్తించే భూమిలో తల్లి అంత్యక్రియలు చేయడానికి అంగీకరించనని మొరాయించాడు. మృతురాలి పెద్దకొడుకు, తన సోదరుడి భూమిలో అంత్యక్రియలు చేయాలని గొడవకు దిగాడు. తన తల్లి పేరుతో ఉన్న భూమి తనకు ఇచ్చేవరకు, తాను చెప్పిన డిమాండ్లను పరిష్కరించే వరకు తల కొరివి పెట్టనన్న చిన్న కొడుకు రవీందర్ తీరుపై గ్రామస్తులు కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ అతను తలకొరివి పెట్టేది లేదంటూ రచ్చ చేస్తున్నాడు.

 కొడుక్కి కౌన్సిలింగ్ ఇస్తున్న పోలీసులు .. షాక్ లో గ్రామస్తులు

కొడుక్కి కౌన్సిలింగ్ ఇస్తున్న పోలీసులు .. షాక్ లో గ్రామస్తులు

ఇక ఈ విషయం తెలిసిన పోలీసులు తల్లి అంత్యక్రియలు పూర్తి చేయాలని, ఏదైనా ఆస్తి గొడవలు ఉంటే తర్వాత మాట్లాడుకోవాలని రవీందర్ కు కౌన్సిలింగ్ ఇస్తున్నారు.
తల్లి మరణించిన బాధ ఏమాత్రం లేకుండా, ఆస్తి కోసం నా కొడుకు కొట్లాడుతున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మానవ సంబంధాలకు, రక్త సంబంధాలకి అర్థం లేదని రవీందర్ తీరుకు షాక్ తిన్న గ్రామస్తులు చెప్పుకుంటున్నారు. తల్లికి తల కొరివి పెట్టనన్న తనయుడి కఠినత్వంపై మాట్లాడుకుంటున్నారు.

Recommended Video

    Twitter Removes Amit Shah Display Photo | Oneindia Telugu
     ఆస్తి కోసం తల్లిదండ్రుల ఫోటోకి చెప్పుల దండేసి , తండ్రిని కిడ్నాప్ చేసిన తనయులు

    ఆస్తి కోసం తల్లిదండ్రుల ఫోటోకి చెప్పుల దండేసి , తండ్రిని కిడ్నాప్ చేసిన తనయులు

    ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో మరో చోట దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆస్తి కోసం కన్న తండ్రినే కొడుకులు కిడ్నాప్ చేశాడు. సూర్యాపేట జిల్లా భగత్ సింగ్ నగర్ లో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన లో కొడుకుల బారినుండి తన భర్తను కాపాడాలని తల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది . తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆస్తి కోసం బతికున్న తల్లిదండ్రుల ఫోటోలు చెప్పుల దండ వేసి తన కొడుకును మానసికంగా చిత్రహింసలకు గురి చేశారని, అంతేకాకుండా ఆస్తి కోసం తన భర్త రిటైర్డ్ తాసిల్దార్ అయినా సంజీవరావును కిడ్నాప్ చేశారని ఆ తల్లి పోలీసుల ముందు వాపోయారు. స్థానికంగా ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+