చొక్కాలు పట్టుకొని ఘర్షణకు దిగిన మాజీ ఎమ్మెల్యే విష్ణు, ఎమ్మెల్యే వంశీచంద్
హైదరాబాద్: భాగ్యనగరంలో ఓ మాజీ ఎమ్మెల్యే, తాజా ఎమ్మెల్యే చొక్కా పట్టుకొని, నెట్టుకొన్న సంఘటన శుక్రవారం జరిగింది. ఇరువురు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయానికి వస్తే విష్షువర్ధన్ రెడ్డి జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత. వంశీచంద్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే.
వీరుద్దరు మాదాపూర్‌లో ఓ విందుకు హాజరయ్యారు. ఆ విందు విష్ణువర్ధన్ రెడ్డి బావమరిదికి చెందినదిగా తెలుస్తోంది. ఈ సమయంలో విష్ణు అక్కడ ఉండగా.. వంశీచంద్ వచ్చి అతని భుజం పైన చేయ వేశాడని తెలుస్తోంది. కొందరు నెట్టివేశారని అంటున్నారు. దీంతో ఆగ్రహించిన విష్ణు అతని పైన సీరియస్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరి చొక్కా మరొకరు పట్టుకున్నారు. అనంతరం వీరు ఇరువురు కూడా మాదాపూర్ పోలీసు స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు.

కాగా, పోలీసులు తమ ఫిర్యాదును స్వీకరించడం లేదని విష్ణువర్ధన్, ఆయన తల్లి పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించారు. అనంతరం పోలీసులు ఇరువురి ఫిర్యాదులు తీసుకున్నారు. మధ్యలో కొందరు కల్పించుకొని నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా వినలేదని తెలుస్తోంది.
విష్ణు చేయి చేసుకున్నాడని వంశీచంద్ వర్గాలు చెబుతుండగా, వంశీచంద్ రెడ్డి నెట్టివేశాడని విష్ణువర్ధన్ రెడ్డి వర్గాలు చెబుతున్నాయి.
జరిగింది ఇదా..!
విష్ణు బావమరిది పెళ్లికి వంశీచంద్ రెడ్డి కూడా వచ్చారని, ఆ సమయంలో విష్ణును వంశీ గన్ మెన్ అడ్డు తప్పుకోవాలని సూచించడం.. మాజీ ఎమ్మెల్యే అతనిని కొట్టారని, దీంతో వంశీచంద్ మాజీ ఎమ్మెల్యే విష్ణు పైన ఆగ్రహం వ్యక్తం చేసారని చెబుతున్నారు. ఈ పెళ్లి ఎన్ కన్వెన్షన్ సెంటరులో జరిగింది.
బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయంలో రగడ
బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయంలో కో ఆప్షన్ ఎన్నికల్లో తెలంగాణ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఉద్రిక్తత ఏర్పడింది. పలువురు ఫర్నీచర్ ధ్వంసం చేశారు.












Click it and Unblock the Notifications