• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పొంగులేటితో వైఎస్ షర్మిల మంతనాలు- భారీ ఆఫర్: ఆ ఒక్కటీ తప్ప..!!

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డితో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల మంతనాలు సాగిస్తోన్నారు. ఆయనను పార్టీలో చేర్చుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తోన్నారు. పొంగులేటికి వైఎస్ షర్మిల భారీ ఆఫర్ ఇచ్చారని సమాచారం.
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంటోంది. అన్ని పార్టీలు కూడా ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారిస్తోన్నాయి. అధికార భారత్ రాష్ట్ర సమితి- ఇప్పటికే ఖమ్మం సభతో ప్రచార పర్వానికి తెర తీసింది. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సభకు హాజరు కావడం గులాబీ బాస్ కేసీఆర్ సత్తాకు అద్దం పట్టింది. కాంగ్రెస్ కూడా పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతోంది. హాత్ సే హాత్ జోడో పేరుతో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి- రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయనున్నారు.

కేంద్రమంత్రులతో..

కేంద్రమంత్రులతో..

అటు భారతీయ జనతా పార్టీ- కేంద్ర మంత్రులను రంగంలోకి దింపుతోంది. కేంద్రమంత్రులు బీఎల్ వర్మ, పర్షోత్తమ్ రుపాళ, ప్రహ్లాద్ జోషి, అర్జున్ ముండా ఇప్పటికే తెలంగాణలో పర్యటించారు. నియోజకవర్గస్థాయిలో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోన్నారు. బీజేపీ బిగ్ షాట్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కూడా తెలంగాణలో పర్యటించాల్సి ఉన్నప్పటికీ- అది తాత్కాలికంగా వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ నెల 28వ తేదీన అమిత్ షా తెలంగాణ పర్యటనకు రావాల్సి ఉంది.

వైఎస్ఆర్టీపీ..

వైఎస్ఆర్టీపీ..

ఈ పరిణామాల మధ్య వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సరికొత్త వ్యూహాలతో రంగంలోకి దిగుతోంది. అందరి కంటే ముందే ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల- పాదయాత్రను మొదలు పెట్టారు. 3,000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేశారు. దీనితో పాటు- ఇతర పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు, తటస్థులను పార్టీలో చేర్చుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ద్వారా లబ్ది పొందిన నాయకులతో టచ్ లో ఉంటోంది.

మంతనాలు..

మంతనాలు..

ఈ క్రమంలో ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, లోక్ సభ మాజీ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస రెడ్డితో వైఎస్ షర్మిల మంతనాలు సాగిస్తోన్నట్లు తెలుస్తోంది. ఇవ్వాళ ఆమె- పొంగులేటితో సుదీర్ఘంగా టెలిఫోన్ లో మాట్లాడినట్లు సమాచారం. పార్టీలో చేరితే భారీ ఆఫర్ ఇస్తామనే హామీ సైతం చేసినట్లు చెబుతున్నారు. దీనికి పొంగులేటి కొన్ని షరతులను విధించారని, వాటిపై ఓ అంగీకారానికి వస్తే- వైఎస్ఆర్టీపీలో ఆయన చేరిక లాంఛనప్రాయమే అవుతుందని అంటున్నారు.

వైఎస్ కుటుంబంతో..

వైఎస్ కుటుంబంతో..

నిజానికి- వైఎస్ కుటుంబంతో పొంగులేటికి సన్నిహత సంబంధాలు ఉన్నాయి. రాజకీయాలకు అతీతంగా ఆయన వైఎస్ కుటుంబాన్ని అభిమానిస్తోన్నారు. 2014 రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖమ్మం లోక్ సభకు పోటీ చేశారు పొంగులేటి. అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభంజనాన్ని సైతం తట్టుకుని ఘన విజయాన్ని సాధించారు. తన లోక్ సభ పరిధిలో రెండు అసెంబ్లీ స్థానాలను కూడా గెలిపించుకోగలిగారు.

బీజేపీలో చేరాలనే నిర్ణయం నుంచి..

బీజేపీలో చేరాలనే నిర్ణయం నుంచి..

ఆ తరువాత ఆయన బీఆర్ఎస్ లో చేరినప్పటికీ- అక్కడ ఇమడలేకపోతోన్నారు. పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారు. బీజేపీలో చేరొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఈ నెల 19వ తేదీన ఖమ్మంలో అమిత్ షా సమక్షంలో పొంగులేటీ కాషాయ కండువా కప్పుకొంటారని అంచనాలు వ్యక్తం అయ్యాయి. అది వాస్తవ రూపం దాల్చలేదు. బీజేపీలో చేరే విషయం మీద ఆయన సందిగ్ధంగా ఉన్నారని, కాంగ్రెస్ ఆఫర్ చేస్తోందని చెబుతున్నారు.

పొంగులేటితో..

పొంగులేటితో..

ఈ పరిణామాల మధ్య వైఎస్ షర్మిల- ఎంట్రీ ఇచ్చారు. పొంగులేటితో ఫోన్ లో సుదీర్ఘంగా సంభాషించారు. వైఎస్ఆర్టీపీలో చేరాలని ఆహ్వానించారు. కలిసి పని చేద్దామని, రాజన్న రాజ్యాన్ని మళ్లీ స్థాపించుకుందామని కోరినట్లు తెలుస్తోంది. వైఎస్ కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. గతంలో ఖమ్మం లోక్ సభ స్థానానికి పొంగులేటి పోటీ చేసినప్పుడు ఆయనకు మద్దతుగా షర్మిల ప్రచారం చేసిన విషయం కూడా ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది.

పాలేరు తప్ప..

పాలేరు తప్ప..

ఖమ్మం జిల్లాలో తాను పోటీ చేయదలచుకున్న పాలేరు నియోజకవర్గం తప్ప ఎక్కడి నుంచి పోటీ చేయడానికైనా అంగీకరిస్తానని ఈ సందర్భంగా వైఎస్ షర్మిల పేర్కొన్నట్లు సమాచారం. దీనికి ఆయన సూచనప్రాయంగా అంగీకరించారనీ చెబుతున్నారు. గట్టు రామచంద్ర రావు కూడా పొంగులేటితో మాట్లాడారని తెలుస్తోంది. దీనిపై అటు వైఎస్ఆర్టీపీ వర్గాలు గానీ, పొంగులేటి నుంచి గానీ ఎలాంటి ప్రకటన రాలేదు. వైఎస్ఆర్టీపీలో చేరడానికి పొంగులేటి అంగీకరించితే- ఆయన చేరికను ఘనంగా నిర్వహించాలని భావిస్తోన్నట్లు తెలుస్తోంది.

తిరుమల శ్రీవారి లడ్డూ కౌంటర్‌లో అనూహ్య ఘటన- టీటీడీ కంప్లైంట్తిరుమల శ్రీవారి లడ్డూ కౌంటర్‌లో అనూహ్య ఘటన- టీటీడీ కంప్లైంట్

English summary
Former MP Ponguleti Srinivasa Reddy likely to join in YSRTP, he make a Phone call to YS Sharmila.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X